Advertisementt

ఉపాసన ప్రెగ్నెన్సీ.. చరణ్ కామెంట్స్ వైరల్

Wed 24th May 2023 09:40 PM
ram charan,upasana pregnancy  ఉపాసన ప్రెగ్నెన్సీ.. చరణ్ కామెంట్స్ వైరల్
Upasana pregnancy.. Charan comments are viral ఉపాసన ప్రెగ్నెన్సీ.. చరణ్ కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

మెగా హీరో రామ్ చరణ్-ఉపాసన దంపతులు అతి త్వరలో తల్లితండ్రులు కాబోతున్నారు. ఉపాసన ప్రెగ్నెంట్ తో ఉంది. ఆమె ఏడో నెల ప్రెగ్నెంట్ తో ఉండడంతో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, పుట్టింటివారు, మెట్టినింటి వారు ఆమెకి అంగరంగ వైభవంగా శ్రీమంతం ఫంక్షన్స్ చేసారు. అదలా ఉంటే రామ్ చరణ్ తాజాగా జి20 సమ్మిట్ లో పాలొనేందుకు శ్రీనగర్ వెళ్లారు. రామ్ చరణ్ జి20 సమ్మిట్ లో స్పెషల్ గా కనిపించాడు.

ఆర్.ఆర్.ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ప్రసంశలు అందుకుంటున్న రామ్ చరణ్ శ్రీనగర్ లో జరిగిన జి20 సమ్మిట్ లో మాట్లాడారు. ఆ మాటల్లో జపాన్ పై తనకున్న ప్రత్యేకమైన ప్రేమని తెలియజేసాడు. ఆతర్వాత మీడియాతో మట్లాడుతూ ఉపాసన ప్రెగ్నెన్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తనకి జపాన్ కి మంచి అనుబంధం ఉంది అంటూ రామ్ చరణ్.. యూరప్ నాకు ఇష్టమైన ప్రదేశం. ఇప్పుడు ఆ లిస్ట్ లో జపాన్ కూడా చేరింది. అక్కడి సంసృతి, ప్రజలు అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా ఉపాసన ఇప్పుడు ఏడో నెల ప్రెగ్నెన్సీ. ఆ మ్యాజిక్ జపాన్ లోనే జరిగింది అంటూ నవ్వుతూ సరదాగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం మెగాఫ్యామిలీ అంతా ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి పదకొండేళ్ల కల తీరబోతుంటే ఆ ఆనందం మరింత ఎక్కువడం సహజమే కదా.

Upasana pregnancy.. Charan comments are viral:

Ram Charan Hilarious Comments On Upasana Pregnancy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ