Advertisementt

నిర్మాత అవ్వాలంటే గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి

Fri 26th May 2023 09:28 AM
bandla ganesh  నిర్మాత అవ్వాలంటే గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి
If you want to become a producer, you have to give costly gift to Guruji నిర్మాత అవ్వాలంటే గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలి
Advertisement
Ads by CJ

ప్రొడ్యూసర్ కావాలని కళలు కానివారు టాలీవుడ్ గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే వాళ్ళు నిర్మాతలైపోతారా.. ఇది మేమంటున్న మాట కాదు బండ్ల గణేష్ ఓ అభిమానికి ఇస్తున్న సలహా. మరి టాలీవుడ్ గురూజీ అంటే అర్ధం కానీ వారు, తెలియని వారు ఉండరు. గత కొన్నాళ్లుగా సదరు గురూజీ మీద బండ్ల గణేష్ బాగా పగ పంచేసుకున్నాడు. అవకాశం వచ్చినప్పుడల్లా గురూజీని సోషల్ మీడియా వేదికగా ఏకి పడేస్తున్నాడు, ఇచ్చిపడేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ ఇంకా స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ చిత్రాలతో నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలు చెయ్యడం లేదు అలాగని సినిమాలు నిర్మించడం లేదు. త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం అంటూ అందరిలో ఆసక్తిని రేకెత్తించి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. మొన్నామధ్యన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో దేవర చిత్రం చెయ్యాలనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పట్లో అతనికి డేట్స్ ఇచ్చేలా కనిపించకపోవడంతో బండ్ల ఇక పవన్ తో సినిమా చేసే ఛాన్స్ రాదని ఫిక్స్ అయ్యాడు. దానికి కారణం గురుజీనే అని ఆయన నమ్మకం.

అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే బండ్ల ని ఓ అభిమాని అన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది అని అడిగాడు.. దానికి బండ్ల గణేష్ Meet Guruji & give costly gift it will happen 😜 అంటే గురూజీని కలిసి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే ప్రొడ్యూసర్ అయ్యిపోవచ్చా.. మరి నిజంగానే గురూజీ బండ్ల గణేష్ నుండి ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసారా.. అందుకే బండ్ల ఇలా మాట్లాడుతున్నాడా.. అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి.

If you want to become a producer, you have to give costly gift to Guruji:

Bandla Ganesh satirical comments on Guruji

Tags:   BANDLA GANESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ