మహేష్ బాబు ని హ్యాండ్ సం లుక్ లో , రిచ్ లుక్ లో, క్లాస్ గా, పోకిరిలో మాస్ గా చూసినా.. ఇప్పుడు రాబోతున్న SSMB28 లో మాస్ కి మరో పేరు మహేష్ అనేలా చూపిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. SSMB28 ఫస్ట్ లుక్ లోనే మాసిజాన్ని పరిచయం చేసిన ఆయన రేపు 31 న టైటిల్ రివీల్ చెయ్యబోతున్న పోస్టర్ లో మరింత మాసిజాన్ని చూపించబోతున్నట్టుగా టైటిల్ ప్రీ లుక్ ని వదిలారు. కృష్ణగారి జయంతి సందర్భంగా SSMB28 నుండి టైటిల్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అప్ డేట్స్ వదులుతూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
అమరావతికి అటు ఇటు, గుంటూరు కారం ఈ రెండు టైటిల్స్ లో SSMB28 కి ఏ టైటిల్ ఫైనల్ కాబోతుందో మరో మూడు రోజుల్లో తేలిపోతుంది. అదే విషయాన్ని మేకర్స్ #SSMB28MassStrike అంటూ మహేష్ బ్యాక్ లుక్ తో అప్ డేట్ ఇచ్చారు. అటువైపుకి తిరిగి ఉన్నా మహేష్ తలకి తువ్వాలు చుట్టి నోటిలో బీడీ పెట్టి మాస్ అవతార్ లో కనిపిస్తారనేది అర్ధమైపోతుంది. అంటే మారో మాస్ లుక్ తో టైటిల్ తో రివీల్ చెయ్యడం అయితే పక్కా. మే 31 #SSMB28MassStrike అంటూ అంచనాలు, క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో #SSMB28MassStrike, #SSMB28Glimpse #MaheshBabu𓃵 హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ నానా హడావిడి మొదలు పెట్టేసారు. మరి ఈ మూడురోజులు మహేష్ ఫాన్స్ SSMB28 జాతరలో నిద్రపోయేలా కనిపించడం లేదు.