వచ్చే శుక్రవారం బాక్సాఫీసు వద్ద ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. ఇద్దరు కొత్త హీరోలు సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వస్తున్నారు. అది కూడా టాప్ ప్రొడ్యూసర్స్ ఫామిలీస్ కావడం ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా కనబడుతుంది. ఇప్పటికే ఒకరు హీరోగా ఎంట్రీ ఇచ్చేసి రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే మరొకరు డెబ్యూతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అందులో బెల్లంకొండ సురేష్ ఫ్యామిలీ నుండి ఆయన చిన్న కొడుకు ఒకరు, రెండోవారు ఇండస్ట్రీలో బిగ్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొడుకు అభిరామ్.
అంతేకాకుండా అభిరామ్ ప్యాన్ ఇండియా స్టార్ రానాకి తమ్ముడు, స్టార్ హీరో వెంకటేష్ కి అన్న కొడుకు. మరోపక్క బెల్లంకొండ గణేష్ హీరో శ్రీనివాస్ తమ్ముడు.. కావడం ప్రేక్షకుల్లో మరింతగా క్యూరియాసిటీని పెంచేస్తున్నాయి.
బెల్లంకొండ గణేష్ ఇప్పటికే స్వాతి ముత్యంతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నేను స్టుడెంట్ సర్ మూవీతో రేపు శుక్రవారం రాబోతున్నాడు. ఇక దగ్గుబాటి అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా అహింసా.. ఎన్నో రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ ఫైనల్ గా జూన్ 2 న విడుదలకు సిద్దమయ్యింది. తేజ దర్శకతంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు అహింసాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అభిరామ్.
ఇద్దరూ ఫిలిం బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలు, టాప్ నిర్మాతలు కొడుకులు ఈ జూన్ 2 న బిగ్గెస్ట్ ఫైట్ కోసం రెడీ అవుతున్నారు. ఏ రెండు సినిమాల ప్రమోషన్స్ అన్నీ ఒకదాన్ని మించి మరొకటి డిజైన్ చేసి సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి. ఈ వారం విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులని అలరించని కారణంగా ప్రేక్షకుల హోప్స్ అన్ని వచ్చే వారం విడుదల కాబోయే అహింస, నేను స్టూడెంట్ సర్ మీదే ఉన్నాయి. మరి ఈ కుర్ర హీరోలు ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుంటారో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.