విరాట పర్వం, గార్గి చిత్రాల తర్వాత సాయి పల్లవి తెరపై కనిపించి ఏడాదిన్నర పైనే అయ్యింది. సెలెక్టివ్ గా, నచ్చిన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రత్యేకతని చూపించే సాయి పల్లవి కి స్టార్ ఛాన్సెస్ రావడం లేదో.. వచ్చినా ఆమె ఒప్పుకోవడం లేదో అనే అనుమానం ఆమె అభిమానుల్లో ఎప్పుడూ ఉటుంది. గ్లామర్ కి ఆమడదూరం ఉండే సాయి పల్లవి తన డాన్స్ టాలెంట్, నటన ప్రావీణ్యంతోనే తనని తాను ప్రూవ్ చేసుకుంది. విశేషమైన అభిమాన గణాన్ని మూటగట్టుకుంది.
సాయి పల్లవి డాక్టర్ కమ్ యాక్టర్. జర్జీయాలో డాక్టర్ విద్యని అభ్యసించిన సాయి పల్లవి అనుకోకుండా యాక్టర్ అయ్యింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా గడిపిన సాయి పల్లవి ఏడాది కాలంగా తెరపై కనిపించకపోవడానికి అసలు కారణం బయటపెట్టింది. తనకి గ్యాప్ రాలేదని.. తానే సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నాను అని చెప్పింది. కొద్దిరోజులు సినిమా షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుందామనుకునే ఏ సినిమా ఒప్పుకోలేదని చెప్పింది.
ప్రస్తుతం సాయి పల్లవి ఎలాంటి తెలుగు ప్రాజెక్ట్స్ కి సైన్ చెయ్యకపోయినా తమిళనాట కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కబోయే శివ కార్తికేయన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది.