Advertisementt

పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హైలెట్స్ అవే

Tue 30th May 2023 09:33 AM
ustaad bhagat singh  పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హైలెట్స్ అవే
Highlights of Pawan Ustaad Bhagat Singh పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హైలెట్స్ అవే
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఫుల్ స్వింగ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది బ్రో ద అవతార్, సుజిత్ తో చేస్తున్న OG చిత్రాలు ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉండగా.. ఇప్పటికే బ్రో మూవీ డేట్ వచ్చేసింది. ఇక OG డేట్ డిసెంబర్ లో ఉండబోతుంది అనే టాక్ నడుస్తుంది. ఈ మధ్యలో హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మరో పవర్ ఫుల్ చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఆ షూటింగ్ కూడా మొదలైపోయింది.. దాని గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ అయ్యాయి.

పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులని ఇంప్రెస్స్ చేసేందుకు రెడీ అవుతుండగా.. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ఆయన ఒరిజినల్ కేరెక్టర్ కి దగ్గరగా ఉంటాయని, దానికోసం హరీష్ శంకర్ అదిరిపోయే డైలాగ్స్ రాసాడని చెబుతున్నారు. ఈ డైలాగ్స్ పవన్ నోటి వెంట పవర్ ఫుల్ గా వస్తే ఫాన్స్ కి పూనకాలే అంటున్నారు.

హరీష్ రాసిన పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కి మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, అలాగే యాక్షన్ సన్నివేశాలు కూడా అదే మాదిరి ఆకట్టుకునేలా హరీష్ శంకర్ డిజైన్ చేసాడట. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా శ్రీలీల నటిస్తుంది.

Highlights of Pawan Ustaad Bhagat Singh:

Main highlights in Ustaad Bhagat singh

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ