Advertisementt

కియారా అద్వానీ కాస్ట్లీ కారు కహాని

Tue 30th May 2023 07:01 PM
kiara advani  కియారా అద్వానీ కాస్ట్లీ కారు కహాని
Kiara Advani Costly Car Kahani కియారా అద్వానీ కాస్ట్లీ కారు కహాని
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తాను ప్రేమించిన వాడు సిద్దార్థ్ మల్హోత్రతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏడడుగులు నడిచి ఓ ఇంటిదైంది. రాజస్థాన్ లో జైసల్మేర్ కోటలో అతిధులు, స్నేహితుల మధ్యన అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కియారా అద్వానీ-సిద్దార్థ్ లు పెళ్లి ముచ్చట్లు తీరగానే ఇద్దరూ సినిమా షూటింగ్స్ లో బిజీ అయ్యారు. హనీమూన్ అంటూ షార్ట్ ట్రిప్ వేసి షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న వీరిద్దరూ తాజాగా జపాన్ ట్రిప్ కి వెళ్లారు.

ప్రస్తుతం కియారా అద్వానీ ఓ కారు కొన్నట్లుగా తెలుస్తుంది. ఖరీదైన మెర్సిడెజ్ బెంజ్ కారుని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ కారు కాస్ట్ ఏకంగా మూడు కోట్లు పైనే ఉంటుందట. జపాన్ టూర్ కి వెళ్లి తిరిగొచ్చిన కియారా అద్వానీ తన పేరుపై మెర్సిడెజ్ బెంజ్ కారుని రిజిస్టర్ కూడా చేయించుకుందట కియారా అద్వానీ. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో కియారా అద్వానీ కారు ముచ్చటే హైలెట్ అయ్యింది.

సౌత్ లో రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్న కియారా అద్వానీ.. అటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తోనూ బిజీగా కనబడుతుంది. ఇక సిద్దార్థ్ కూడా షూటింగ్స్ తో కళకళలాడుతున్నాడు.

Kiara Advani Costly Car Kahani:

Kiara Advani Arrived with her Brand New Mercedes Car

Tags:   KIARA ADVANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ