Advertisementt

కోలీవుడ్ మరో స్టార్ ఛాన్స్ కొట్టేసిన త్రిష

Sat 03rd Jun 2023 05:49 PM
danush,trisha  కోలీవుడ్ మరో స్టార్ ఛాన్స్ కొట్టేసిన త్రిష
Trisha In Prestigious D50 కోలీవుడ్ మరో స్టార్ ఛాన్స్ కొట్టేసిన త్రిష
Advertisement
Ads by CJ

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా త్రిష కెరీర్ ని మలుపు తిప్పింది. సీనియర్ లిస్ట్ లోకి వెళ్లిపోయిన త్రిష కి అవకాశాలు తగ్గుతూనే వచ్చాయి. కానీ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ తో త్రిష క్రేజ్ కోలీవుడ్ లో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె సినిమాలో కుందవై పాత్రలో అలాగే ప్రమోషన్స్ లో కనిపించిన తీరుకి ముగ్దులైపోయారు. త్రిష కట్టుబొట్టుకి ఫిదా అయ్యారు. అందుకే ప్రస్తుతం త్రిష కెరీర్ మూడు పూలు ఆరు కాయల మాదిరి వెలిగిపోతుంది. 

పొన్నియన్ సెల్వన్ హిట్టయినా, ప్లాప్ అయినా త్రిషకి మాత్రం బోలెడంత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పటికే విజయ్ తో LEO మూవీలో నటిస్తుంది. అలాగే అజిత్ విడా మయుర్చిలో త్రిషనే హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది అని తెలుస్తోంది. అంతేకాకుండా మణిరత్నం-కమల్ హాసన్ మూవీలో త్రిష పేరే పరిశీలనలో ఉంది. ఇప్పుడు త్రిష మరో స్టార్ ఛాన్స్ పట్టేసింది. అదే ధనుష్ సరసన త్రిష కి బంపర్ ఆఫర్ తగిలింది అంటూ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ వార్త.

కెప్టెన్ మిల్లర్ తర్వాత ధనుష్ స్వీయ దర్శకతంలో భారీ తారాగణంతో తెరకెక్కనున్న చిత్రంలో ధనుష్ కి జోడిగా త్రిష పేరే పరిశీలిస్తున్నారట. ఈలెక్కన కోలీవుడ్ స్టార్ హీరోలంతా త్రిష నామజపమే చేస్తున్నట్టుగా ఉంది ప్రస్తుతం అక్కడి పరిస్థితి.

Trisha In Prestigious D50:

Danush to romance Trisha again

Tags:   DANUSH, TRISHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ