Advertisementt

మాళవిక మోహనన్ న్యూ లుక్

Sat 03rd Jun 2023 08:18 PM
malavika mohanan in orange dress photos  మాళవిక మోహనన్ న్యూ లుక్
Malavika Mohanan New Look goes viral మాళవిక మోహనన్ న్యూ లుక్
Advertisement
Ads by CJ

మలయాళం నుండి కోలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమిళనాట స్టార్ ఛాన్సెస్ పట్టేస్తూ అక్కడ గట్టిగా జెండా పాతేసింది మాళవిక మోహనన్. మాళవిక మోహన్ కి తమిళనాట ఇప్పటివరకు సక్సెస్ దరి చేరలేదు. కానీ ఈ భామ అందాలకి సోషల్ మీడియాలో భలే గిరాకీ ఉంది. ఆమె షేర్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో ఎక్కువుగా హైలెట్ అయ్యే మాళవిక మోహనన్ తరచూ స్పెషల్ గ్లామర్ ఫోటో షూట్స్ హడావిడి చేస్తుంది. మొదటిసారిగా తెలుగులో ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది..

ఇక ఫేమస్ అవ్వడానికో లేదంటే తన తీరు అంతేనో కానీ.. నయనతారని ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ అప్పుడప్పుడు నయన్ ఫ్యాన్ చేతిలో బుక్ అవుతూ ట్రోల్స్ కి గురవుతుంది. ఎప్పుడూ గ్లామర్ ఫొటోస్ తో అందాలు ఆరబోసే మాళవిక మోహనన్ ఈమధ్యన జిమ్ ఫొటోస్ కూడా వదులుతుంది. చమటలు చిందిస్తూ వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా మాళవిక మోహనన్ కొన్ని పిక్స్ వదిలింది.

ఆ పిక్స్ లో ఆమె చాలా సింపుల్ గా కొత్తగా కనిపించింది. గ్లామర్ కి అడ్డాగా ఉండే మాళవిక మోహనన్ ఇంత సింపుల్ గా కనిపించడం ఇదే మొదటిసారమేమో అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆరెంజ్ కలర్ అవుట్ ఫిట్ లో పద్దతిగా కనిపించి మెస్మరైజ్ చేసింది. 

Malavika Mohanan New Look goes viral:

Malavika Mohanan in orange dress Photos

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ