కొన్నాళ్లుగా సీక్రెట్ రిలేషన్ ని మెయింటింగ్ చేస్తూ.. కొద్దిరోజులుగా కలిసి మీడియాకి చిక్కుతున్నా.. మా మధ్యన ఏమి లేదంటూ బుకాయించే సిద్దార్థ్-అదితి రావులు ఇద్దరూ తమ మధ్యన ఎఫైర్ ఉన్న విషయాన్ని మాత్రం ఓపెన్ గా బయటపెట్టరు. అటు అదితి ఏమో.. మా పర్సనల్ విషయాలు మీకనవసరం. నేనో నటిని. నా నటనని చూడండి, నా సినిమాలు చూడండి అంటుంది. ఇటు సిద్దార్థ్ పర్సనల్ విషయాలు మీకేమవసరం అంటాడు.
తాజాగా టక్కర్ ప్రమోషన్స్ లో సిద్దార్థ్ కి పదే పదే అదితి రావుతో ఎఫైర్ విషయమై ప్రశ్న ఎదురవుతుంది. కానీ సిద్దు ఎక్కడా మీడియా వాళ్ళకి దొరకడం లేదు.. కన్ఫ్యూజ్ చేస్తూ ఆన్సర్ ఇస్తున్నాడు. ఓ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ ఉన్నాయి కదా అని అడిగితే.. అవి రూమర్స్ అంటున్నారు, ఇంకా నా సమాధానం ఎందుకండీ అంటాడు, కొన్ని విషయాలను సీక్రెట్ గానే ఉంచాలని సున్నితంగా తప్పించుకున్నాడు.
హీరోల లైఫ్ సీక్రెట్స్ బయటికి తెలిసిపోతే సినిమాలో ఆ హీరో పాత్రపై ఇంట్రెస్ట్ పోతుంది అన్నాడు. అంతేకాకుండా అదితితో రిలేషన్ గురించి సమయం వచ్చినప్పుడు చెబుతా అంటూ సింపుల్ గా తప్పించుకుని.. అక్కడే అడ్డంగా దొరికిపోయాడు. అదితి విషయంలో ఏం లేకపోతె సమయం వచ్చినప్పుడు చెప్పడానికి ఏం ఉంటుంది.. ఏం ఉండదు కదా.. అయ్యో సిద్దు భలే దొరికేసావ్ గా.. అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.