Advertisementt

ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ

Wed 07th Jun 2023 01:12 PM
custody  ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ
Custody OTT streaming date confirmed ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ
Advertisement
Ads by CJ

వరస డిజాస్టర్స్ తో ఇబ్బంది పడిన అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీపై చాలా నమ్మకమే పెట్టుకున్నాడు. తెలుగు, తమిళ్ లో బైలింగువల్ మూవీగా తెరకెక్కిన కస్టడీ హిట్ అవుతుంది అని నమ్మాడు. ప్రమోషన్స్ లోను అంతే నమ్మకంతో కనిపించదు. అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి పేరున్న నటులు, కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కానీ కస్టడీ తెలుగు, తమిళ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. దానితో నాగ చైతన్య కి మరో ప్లాప్ ఖాతాలో చేరింది. అయితే మే 12 న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది అని అందరూ భావించారు. అయితే మూడు వారాల్లో కాకపోయినా.. నాలుగు వారాల్లో అంటే 28 రోజులకి కస్టడీ ఓటిటీ రిలీజ్ కి రెడీ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ నాగ చైతన్య కస్టడీ ఓటిటీ హక్కులని దక్కించుకుంది. జూన్ 9న అమెజాన్ ప్రైమ్ నుండి కస్టడీ ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అమెజాన్ ప్రైమ్ కస్టడీ ఓటిటి రిలీజ్ డేట్ ని రెండు రోజుల ముందు అంటే ఈరోజే అధికారికంగా ప్రకటించింది. అక్కినేని అభిమానులు, ఓటిటీ ఆడియన్స్ జూన్ 9 న చైతూ కస్టడీ ఓటిటిలో చూసేందుకు రెడీ అవ్వండి మరి.

Custody OTT streaming date confirmed:

Custody OTT releasing on June 9th

Tags:   CUSTODY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ