Advertisementt

నీ స్టయిల్ కి ఫిదా బాలయ్యా..

Sat 10th Jun 2023 12:19 PM
bhagavanth kesari  నీ స్టయిల్ కి ఫిదా బాలయ్యా..
Dapper looks by Balakrishna నీ స్టయిల్ కి ఫిదా బాలయ్యా..
Advertisement
Ads by CJ

అఖండ దగ్గర నుండి నందమూరి బాలకృష్ణ స్టయిల్ ఒక్కసారిగా మారిపోయింది. గతంలో నందమూరి ఫాన్స్ కే కాదు చాలామంది ప్రేక్షకులకి ఆయన విగ్స్ విషయంలో కంప్లైంట్ ఉండేది. కానీ అఖండ సినిమా, అన్ స్టాపబుల్ టాక్ షో అప్పటినుండి బాలయ్య స్టయిల్ కి, ఆయన మ్యానరిజానికి, లుక్ కి ఫాన్స్ బాగా ఫిదా అవుతున్నారు. మాస్ ఆడియన్స్ అయితే బాలయ్యని మరింతగా పొగుడుతున్నారు. బాలయ్య డ్రెస్సింగ్ స్టయిల్, ఆయన హెయిర్ స్టయిల్, లుక్స్ .. కాస్త బరువు తగ్గి ఫిట్ గా కనిపించడం ఇలా ప్రతి ఒక్క విషయానికి బాలయ్య ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య లుక్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది. బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఇరగదీసారు. నందమూరి ఫాన్స్ కి అయితే పండగే. డైలాగ్స్ కన్నా ఎక్కువుగా బాలయ్య లుక్స్ ని ఫాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. బాలకృష్ణ నుండి వస్తున్న పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ స్టయిల్ అన్ని భగవంత్ కేసరిలో హైలెట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. 

అయితే చాలామంది బాలయ్య అభిమానులు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ లేకపోయినా.. బాలయ్య యాక్షన్ స్టయిల్ బావుంది.. అనిల్ రావిపూడి అతి కామెడీ మా బాలయ్య చేస్తే ఎలా ఉండేదో.. హమ్మయ్య మా బాలయ్యని మాకు కాల్సినట్టు చూప్పించాడు అనిల్.. నువ్ సూపర్ అంటూ అనిల్ రావిపూడిని మెచ్చేసుకుంటున్నారు.

Dapper looks by Balakrishna:

Bhagavanth Kesari teaser: Dapper looks by Balakrishna

Tags:   BHAGAVANTH KESARI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ