జబర్దస్త్ ద్వారా బుల్లితెరకి పరిచయమై ఆర్ధికంగా నిలదొక్కుని సినిమా అవకాశాలతో హడావిడి చేస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ కొంతమంది నిజాయితీగా కెరీర్ ని డెవెలెప్ చేసుకుంటుంటే.. మరికొంతమంది జబర్దస్ ఫేమ్ ని అడ్డంగా వాడుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అప్పట్లో పరదేశి, దొరబాబులు వైజాగ్ రైడింగ్ లో పోలీసులకి అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా జబర్దస్త్ హరిపై స్మగ్లింగ్ కేసు నమోదు కావడం కలకలం సృష్టించింది. జబర్దస్త్ లో లేడీ గెటప్స్ తో హైలెట్ అవుతున్న హరి అలియాస్ హరిత చంటి టీమ్ లోనే కాదు.. వెంకీ మంకీ టీమ్.. ఇలా చాలా టీమ్స్ లో కామెడీ చేసుకుంటున్నాడు.
జబర్దస్త్ మాత్రమే కాకుండా హరి ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ లో.. కిషోర్ అనే వ్యక్తిని పట్టుకోగా.. అతను జబర్దస్థ్ హరి పేరు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానితో పోలీసులు కేసు నమోదు చేసి హరి కోసం గాలిస్తున్నారు. అయితే కిషోర్ ని పట్టుకున్నప్పుడే హరి ని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ట్రై చెయ్యగా అతను పరారైనట్టుగా తెలుస్తుంది.
హరి పై ఇలాంటి స్మగ్లింగ్ కేసు మొదటిసారి కాదని గతంలోనూ అతనిపై ఈ రకమైన స్మగ్లింగ్ కేసులు ఉన్నాయని చెబుతున్నారు. జబర్దస్త్ తో ఫేమస్ అయ్యి కొంతమంది ఇలా గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ లు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.