నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన దసరా మూవీ మార్చ్ 30న శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ ఆడమే కాదు.. నానిని 100 కోట్ల క్లబ్బులో చేర్చింది. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసిన దసరా ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో ఇరగాడేసింది. దానితో నాని మొదటిసారిగా 100 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టగలిగాడు.
ఇక థియేటర్స్ లో హిట్ అయిన దసరా నెల తిరగ్గానే ఓటిటిలోకి కూడా వచ్చేసింది. ప్రస్తుతం దసరా ముచ్చట ముగిసిన సమయంలో.. దసరా హిట్ అన్నారు, 100 కోట్లు తెచ్చింది అన్నారు. కానీ నాకు మాత్రం పేమెంట్ ఎగ్గొట్టారు అంటూ జూనియర్ ఆర్టిస్ట్ కమ్ సింగర్ కమ్ ఏజెంట్ శ్రీను దసరా మేకర్స్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్టులని చాలా చీప్ గా చూస్తారు. వచ్చేవరకు మంచిగా మాట్లాడతారు. వచ్చాక అస్సలు పట్టించుకోరు. డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వరు అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
దసరా సినిమా కోసం గోదావరి ఖనికి 23 మందిని తీసుకొచ్చాను. వారం పాటు దసరా లొకేషన్ లోనే ఉన్నాము. కానీ ఇప్పటివరకు మాకు డబ్బులు ఇవ్వలేదు. పైగా నాకు పైన 70 వెల ఖర్చు అయ్యింది. నేను తీసుకెళ్లినవాళ్లు నన్నేకదా అడుగుతారు. వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేదు. సగమే ఇచ్చాను. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయంటూ ఏజెంట్ శ్రీను దసరా మూవీ మేకర్స్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.