Advertisementt

కన్ ఫామ్: దేవరకొండ తో మృణాల్ ఠాకూర్

Wed 14th Jun 2023 01:45 PM
vijay deverakonda,mrunal thakur  కన్ ఫామ్: దేవరకొండ తో మృణాల్ ఠాకూర్
Vijay Deverakonda to romance Mrunal Thakur కన్ ఫామ్: దేవరకొండ తో మృణాల్ ఠాకూర్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి మూవీ షూటింగ్ తో బిజీగా ఉండడమే .. గౌతమ్ తిన్ననూరి తో VD12 కూడా మొదలు పెట్టేసాడు. ఖుషి సినిమాలో సమంతతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ VD12 లో శ్రీలీల తో రొమాన్స్ చేస్తున్నాడు. గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ మరియు పరశురామ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారన్న విషయాన్ని కొద్ది రోజుల ముందు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

పరశురామ్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా ను నిర్మాత దిల్ రాజు శిరీష్ లు నిర్మిస్తుండగా హైదరాబాదులో ఈరోజు ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షార్ట్ ను గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు, ప్రముఖ ఫైనాన్షియర్ సత్తి రంగయ్య కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. 

సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి అందరినీ తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ గా నటించబోతోంది. ఈ జోడి స్క్రీన్ మీద ఫ్రెష్ గా ఉండబోతుంది అంటున్నారు.

Vijay Deverakonda to romance Mrunal Thakur :

Vijay Deverakonda, Mrunal Thakur, Parusuram starrer VD13 / SVC 54 gets officially launched

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ