Advertisementt

ఆదిపురుష్ రెండో రోజూ కుమ్మేశాడు

Fri 23rd Jun 2023 12:01 PM
100 crore,adipurush,day 2,prabhas  ఆదిపురుష్ రెండో రోజూ కుమ్మేశాడు
Adipurush Day 2 Collections Creates Records ఆదిపురుష్ రెండో రోజూ కుమ్మేశాడు
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాఘవుడిగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు దాదాపు రూ. 140 కోట్లు వచ్చినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించగా.. రెండో రోజు అనగా శనివారం కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టి.. డే 2 కలెక్షన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా రెండో రోజు రూ. 100 కోట్లపైన సాధించినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా రెండు రోజులకే దాదాపు రూ. 240 కోట్లను రాబట్టింది. మరీ ముఖ్యంగా విడుదలైన రెండో రోజు రూ. 100 కోట్లు కొల్లకొట్టడం.. అందులోనూ భారీగా నెగిటివ్ టాక్ ఉన్నా కూడా.. కలెక్షన్ల సునామీ ఆగలేదంటే.. అందుకు కారణం ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్పుకోవాలి.

ఇక సినిమా విడుదలైన మూడో రోజు కూడా ఆదిపురుష్ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 3వ రోజు కూడా చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. దీంతో మొదటి మూడు రోజులలోనే ఆదిపురుష్ చాలా వరకు రికవరీ చేసే అవకాశం ఉంది. అయితే అసలు పరీక్ష మాత్రం సోమవారం నుంచి ఈ సినిమాకి మొదలు కాబోతోంది. సోమవారం కూడా కలెక్షన్స్ కనుక స్టడీగా ఉంటే మాత్రం చాలా వరకు ఆదిపురుష్ గట్టెక్కినట్లే. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్‌లో ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబడుతోంది.

మేకర్స్ కూడా అధికారికంగా ఈ సినిమా రెండో రోజు రూ. 100 కోట్లు రాబట్టినట్లుగా తెలుపుతూ.. టోటల్‌గా రెండు రోజులకు రూ. 240 కోట్లు వచ్చినట్లుగా పోస్టర్ విడుదల చేశారు. మూడో ఆదివారం కూడా కలెక్షన్స్ బాగున్నాయనే టాక్ వినిపిస్తుంది. మూడో రోజు కూడా ఈ సినిమా రూ. 100 కోట్లు రాబడుతుందనేలా మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే ప్రభాస్ బాక్సాఫీస్‌ని కుమ్మేసినట్లే. చూద్దాం మూడో రోజు ఏం జరుగుతుందో..

Adipurush Day 2 Collections Creates Records:

100 Crore Collected in Day 2 Says Adipurush Makers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ