జబర్దస్త్ వేణు కాస్తా ఇప్పుడు బలగం వేణుగా మారాడు. జబర్దస్త్ లోనే కాదు.. వెండితెర మీద హీరోలకి స్నేహితులుగా, కమెడియన్ గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వేణు టిల్లు తాను డైరెక్ట్ చేసిన మొదటి చిత్రంతోనే తెలంగాణ ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసాడు. బలగం తోనే బ్రహ్మాండమైన భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం సక్సెస్ తర్వాత వేణు తన రెండో చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ తో చేస్తాడనే ప్రచారం జరిగింది.
అయితే బలగం విజయం తర్వాత వేణు తన ఫ్రెండ్ శ్రీను, సుధీర్ లతో ఓ వెకేషన్ ని ఎంజాయ్ చేసి వచ్చాడు. కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న వేణు తన తదుపరి ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు. తన తదుపరి చిత్రం స్క్రిప్టు పనులని మొదలు పెట్టినట్టుగా పెన్ను, పేపర్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
అయితే వేణు తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం ఎలాంటి నేపథ్యం తీసుకోబోతున్నాడు, మళ్ళీ బలగం లాంటి ఫ్యామిలీ కాన్సెప్ట్ తీసుకుంటాడా.. లేదంటే కొత్త జోనర్ ట్రై చేస్తాడా.. అని చాలామంది నెటిజెన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరోపక్క వేణు పెన్ను, పేపర్ పోస్ట్ చేసి కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ మొదలు పెట్టినట్లుగా చెప్పడంతో అందరూ ఆయనకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. బలగం లాంటి భారీ హిట్ కొట్టాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.