Advertisementt

అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫాన్స్ సందడి

Tue 20th Jun 2023 07:12 PM
ram charan,upasana konidela  అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫాన్స్ సందడి
Mega Fans Hungama At Apollo Hospitals అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫాన్స్ సందడి
Advertisement
Ads by CJ

ఈరోజు తెల్లవారుఝామున రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండండి ఆడపిల్ల జన్మించింది. మెగాస్టార్ కి మనవరాలు పుట్టింది అనే శుభవార్త విన్న మెగా ఫాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఉపాసన మెగా ప్రిన్స్ కి జన్మనిచ్చింది అంటూ అభిమానులు హడావిడి మొదలు పెట్టారు. ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరు దంపతులు, అలాగే అల్లు అరవింద్ ఆయన భార్య, అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ, నిహారిక, వరుణ్ తేజ్, ఆర్.ఆర్.ఆర్ నిర్మాత దానయ్య ఇలా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అంతా అపోలో ఆసుపత్రికి మెగా ప్రిన్స్ ని చూసేందుకు వచ్చారు.

ఇక చిరు మీడియాతో మాట్లాడుతూ తన మనవరాలి జాతకం మహార్జాతకం, అందువల్లే మా ఫ్యామిలిలో అన్ని మంచి కార్యక్రమాలే జరుగుతున్నాయంటూ మాట్లాడారు. ఇక వీరంతా అపోలో ఆసుపత్రికి వస్తున్న సమయంలో మెగా ఫాన్స్ వెల్ కమ్ బేబీ గర్ల్ అంటూ బ్యానర్ లు కట్టి హంగామా చేసారు. చిరు, అల్లు అర్జున్, అల్లు అరవింద్, నిహారిక ఇలా అందరూ వస్తున్న సమయంలో మెగా అభిమానులు జై చరణ్, జై మెగా ప్రిన్స్ అంటూ నినాదాలు చేసారు.

ఈరోజు ఉదయమైతే అక్కడ ఇసుక వేస్తె రాలనంతమంది జనం కనిపించారు. అటు చరణ్ తండ్రి అయ్యాడన్న వార్త. ఇటు మెగా ఫ్యామిలీని చూడవొచ్చనే అతృతతో అపోలో ఆసుపత్రికి మెగా అభిమానులు తరలిచ్చారు. బుల్లి మెగా ప్రిన్స్ కి స్వాగతం చెబుతూ జై జైలు పలికారు.

Mega Fans Hungama At Apollo Hospitals:

Ram Charan, Upasana Konidela welcome baby girl

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ