రిపబ్లిక్ తో సాలిడ్ హిట్ కొట్టినా.. కల్లెక్షన్న్ పరంగా ఫెయిల్ అయిన సాయి ధరమ్ తేజ్ తర్వాత రోడ్ యాక్సిడెంట్ తో సతమతమయ్యాడు. యాక్సిడెంట్ నుండి కోలుకుని సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తో విరూపాక్ష మూవీ చేసాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరూపాక్ష తెలుగు రాష్ట్రాల ఆడియన్స్ ని బాగా నచ్చడంతో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి తన కెరీర్ లో 100 కోట్ల క్లబ్బుకి దగ్గరయ్యాడు. ఆ తర్వాత మేనమామ పవన్ కళ్యాణ్ తో సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమా చేసాడు. అది ఆల్మోస్ట్ షూటింగ్ ముగించుకుని విడుదలకి దగ్గరైంది.
ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సంపత్ నందితో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ప్రస్తుతానికి వీరి కలయికపై అఫీషియల్ అనౌన్సమెంట్ రాకపోయినా.. సాయి ధరమ్ తేజ్-సంపత్ నంది కాంబో చిత్రానికి గాంజా శంకర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చేసాడు. మెగాస్టార్ చిరు శంకర్ దాదా MBBS , శంకర్ దాదా జిందాబాద్, తాజాగా భోళా శంకర్ టైటిల్ తో సినిమాలు చేశారు. ఇప్పుడు అదే టైటిల్ సెంటిమెంట్ తో సాయి ధరమ్ తేజ్ సినిమా మొదలు పెట్టేందుకు సిద్దమయ్యాడు.
సాయి ధరమ్ తేజ్ త్వరలోనే గాంజా శంకర్ టైటిల్ తో సంపత్ నందితో కలిసి మూవీ మొదలు పెట్టబోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్, అలాగే మిగతా నటుల వివరాలు తెలియాల్సి ఉంది.