Advertisementt

ఆలస్యమవుతున్న బిగ్ బాస్ 7

Thu 22nd Jun 2023 11:58 AM
bigg boss 7 telugu  ఆలస్యమవుతున్న బిగ్ బాస్ 7
Delayed Bigg Boss 7 ఆలస్యమవుతున్న బిగ్ బాస్ 7
Advertisement
Ads by CJ

ఆరు సీజన్స్ గా బిగ్ బాస్ ప్రతి ఏడు సెప్టెంబర్ మొదటి వారంలో స్టార్ మా లో గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. గత ఏడాది బిగ్ బాస్ ఓటిటీని కూడా మొదలు పెట్టిన డిస్ని ప్లస్ హాట్ స్టార్ అది అనుకున్నంతగా వర్కౌట్ అవ్వక ఈ ఏడాది సైలెంట్ అయ్యింది. ఇక ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్7 కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది అంటున్నారు. అందుకే స్టార్ మా లో నీతోనే డాన్స్ అంటూ శని ఆదివారాలు 9 గంటల స్లాట్ ని బుక్ చేసారని.. నీతోనే డాన్స్ ఫినిష్ అయ్యేవరకు బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కాదని తెలుస్తుంది. నీతోనే డాన్స్ పూర్తవ్వాలంటే మూడు నెలల సమయం పడుతుంది.. రియల్ జోడిలతో స్టార్ మా నీతోనే డాన్స్ ప్రోగ్రాం ప్లాన్ చేసింది.

అందుకే సెప్టెంబర్ మొదటి వారంలో మొదలు కావల్సిన బిగ్ బాస్ సీజన్ 7 సెప్టెంబర్ చివరి వారంలోకి జరగొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ సీజన్ నుండి నాగార్జున హోస్ట్ గా తప్పుకుంటారనే ప్రచారం మొదటి నుండి జోరుగా సాగుతుంది. రానా కానీ, బాలకృష్ణ కానీ బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా రావొచ్చని అంటున్నారు. మరోపక్క నాగార్జున ఎట్టిపరిస్థితుల్లో బిగ్ బాస్ నుండి తప్పుకోరు.. ఆయన ప్లేస్ లోకి మరెవరూ వచ్చే ఛాన్స్ లేదనే మాట కూడా వినిపిస్తుంది.

ఇక ఇప్పటికే స్టార్ మా-బిగ్ బాస్ యాజమాన్యం కలిసి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు పెట్టినట్లుగా సమాచారం. గత రెండు సీజన్స్ డల్ అవడంతో ఈ  సీజన్ కోసం పేరున్న సెలబ్రిటీస్ కి భారీ పారితోషకాలిచ్చి తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారట. 

Delayed Bigg Boss 7:

Delayed Bigg Boss 7 Telugu

Tags:   BIGG BOSS 7 TELUGU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ