Advertisementt

KP చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో అషు రెడ్డి

Fri 23rd Jun 2023 09:32 PM
ashu reddy,kp chowdary  KP చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో అషు రెడ్డి
Ashu Reddy and Others Names in KP Chowdary KP చౌదరి డ్రగ్స్ లిస్ట్ లో అషు రెడ్డి
Advertisement
Ads by CJ

కబాలి నిర్మాత KP చౌదిరి డ్రగ్స్ కేసులో రిమాండ్ లో ఉన్నాడు. గోవాలో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడిన KP చౌదరిని పోలీసులు విచారిస్తుండగా.. ఆయన ఫోన్ లో టాలీవుడ్ స్టార్స్ ఫోన్ నెంబర్లు, వారి ఫొటోస్ బయటపడగా.. KP చౌదరి మాత్రం తనకే పాపం తెలియదు, తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కానీ.. ఎప్పుడూ ఎవరికీ డ్రగ్స్ అమ్మలేదు, తన ఫోన్ లో సెలబ్రిటీస్ ఫోన్ నెంబర్లు ఇంకా వారి ఫొటోస్ ఉన్నాయి కానీ.. వారికి ఈ డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు అని పోలీసులకి చెప్పినట్లుగా తెలుస్తుంది.

కానీ పోలీస్ లు KP చౌదరి ఫోన్ డేటాని పరిశీలించగా.. చౌదరి టాలీవుడ్ లోని 12 మంది సెలబ్రిటీస్ కి ముఖ్యంగా తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్న అషు రెడ్డికి, అలాగే ఓ ఐటెం సాంగ్ చేసిన హీరోయిన్ కి పలుమార్లు డ్రగ్స్ అమ్మడమే కాకుండా, వారితో వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసుల విచారణలో తేలినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అషు రెడ్డి, ఆ ఐటెం హీరోయిన్ తో KP చౌదరి క్లోజ్ గా ఉన్న ఫొటోస్ కూడా బయటపడినట్లుగా తెలుస్తుంది.

ఇంకా ఈ లిస్ట్ లో రఘురాజు, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నీతినేష్, బెజవాడ భరత్, శ్వేతా, ఠాగూర్ ప్రసాద్ లతో పాటుగా పలువురు బడా వ్యాపారవేత్తలకు, పొలిటిషన్స్ కి KP చౌడరి డ్రగ్స్ అమ్మినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా పలువురు యువతులు కూడా KP డ్రగ్స్ అమ్మిన లిస్ట్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముందు తానేమి నేరం చెయ్యలేదని తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు మాత్రమే ఉందని బుకాయించిన చౌదరి ఫైనల్ గా రెండు రోజుల పోలిసుల విచారణలో 12మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా ఒప్పుకున్నాడని చెబుతున్నారు.

Ashu Reddy and Others Names in KP Chowdary:

KP Chaudhary Drugs Case Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ