Advertisementt

గుంటూరు కారం: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్

Fri 23rd Jun 2023 10:22 PM
guntur kaaram  గుంటూరు కారం: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Guntur Kaaram shooting update గుంటూరు కారం: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న గుంటూరు కారం విషయంలో మహేష్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త షెడ్యూల్ విషయమై అయోమయంలో ఉన్న ఫాన్స్ కి పూజ హెగ్డే, థమన్ తప్పుకున్నారనే న్యూస్ మరింత ఆందోళనకి గురి చెయ్యగా.. ఈ నెల 23 నుండి అంటే ఈరోజు నుండి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ మొదలవుతుంది అని అన్నప్పటికీ దానికి సంబందించిన అప్ డేట్ ఇవ్వకపోయేసరికి వారు చాలా డిస్పాయింట్ అయ్యారు..

అయ్యితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం గుంటూరు కారం కొత్త షెడ్యూల్ రేపు శనివారం హైదరాబాద్ లోని హౌస్ సెట్ లో మొదలు పెట్టబోతున్నారు. మహేష్ బాబు, రఘుబాబు, ఈశ్వరి రావు లపై కీలక సన్నివేశాలని త్రివిక్రమ్ చేపట్టనున్నారని తెలుస్తుంది. రేపు మొదలయ్యే కొత్త షెడ్యూల్ కి చిన్న గ్యాప్ రాకుండా మూడు నెలల పాటు నిర్విరామంగా జరగనుంది అని.. ఈ భారీ షెడ్యూల్ లో షూటింగ్ చాలావరకు కంప్లీట్ అవుతుంది అంటున్నారు.

ఇదే షడ్యూల్ లో శ్రీలీల కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందట.. పూజ హెగ్డే ప్లేస్ లోకి మరో హీరోయిన్ వచ్చినా రావొచ్చనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. ఏది ఏమైనా కొత్త షెడ్యూల్ అప్ డేట్ చూసాక మహేష్ ఫాన్స్ కి టెన్షన్ మొత్తం ఎగిరిపోయింది. 

Guntur Kaaram shooting update:

Mahesh babu Guntur Kaaram shooting update

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ