ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్కుడు వేణు స్వామి పేరు మార్మోగిపోతోంది. ఇటు సినిమా ఇండస్ట్రీ లోనే కాదు.. అటు రాజకీయాల్లోనూ ఈయనగారి జాతకాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. ఆయన చెప్పిన జాతకాలు నిజమవుతున్నాయి. అందుకే అందరూ వేణు స్వామి ఆస్ట్రాలజీనే నమ్ముతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే వేణు స్వామితో తమ ఇళ్లల్లో స్పెషల్ పూజలు నిర్వహిస్తున్నారు. కెరీర్ లో టాప్ పొజిషన్ కి వెళ్లాలని వారు ఈ స్పెషల్ పూజలని వేణు స్వామితో చేయించుకుంటున్నారు.
అందులో ప్రెజెంట్ టాప్ హీరోయిన్ రష్మిక, మొన్నామధ్యన నిధి అగర్వాల్ ఇలానే వేణు స్వామితో పూజలు చేయించుకుంటే.. ఇప్పుడు ఆ లిస్ట్ లో తెలుగు హీరోయిన్ చేరింది. వరస డిజాస్టర్స్ తో సతమతమతమవుతున్న డింపుల్ హయ్యాతి రీసెంట్ గా పోలీస్ ఆఫీసర్ తో పార్కింగ్ గొడవలో మీడియాలో బాగా హైలెట్ అయ్యింది. కేసులతో సతమతమయిన డింపుల్ హయ్యాతి ప్రస్తుతం కెరీర్ లో అంతే ఇబ్బందులు పడుతుంది. అందుకే ఆమె వేణు స్వామితో తన ఇంట్లోనే స్పెషల్ పూజలు చేయించినట్లుగా తెలుస్తుంది.
డింపుల్ హయ్యాతి ఉంటున్న ఫ్లాట్ లోనే వేణు స్వామి వేదమంత్రాల నడుమ ఆమెతో యాగం జరిపించిన వీడియో ఒకటి వైరల్ గా మారడంతో.. ఇప్పుడు వేణు స్వామి పూజల లిస్ట్ లోకి డింపుల్ హయాతి కూడా చేరినట్లుగా అందరికి తెలిసిపోయింది.