నిన్నటివరకు కూల్ గా ఉన్న మెగా ఫాన్స్ భోళా శంకర్ టీజర్ తో పండగ చేసుకోవడం పక్కనపెట్టి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మెగాస్టార్ భోళా శంకర్ టీజర్ తో ట్రీట్ ఇస్తే.. పండగ చేసుకుని సంబరాల్లో మునిగిపోవాల్సిన మెగా ఫాన్స్ కి ఎందుకింతగా కోపమొస్తుంది అంటే.. రామ్ చరణ్ రీసెంట్ మూవీ గేమ్ ఛేంజర్ డేట్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం స్పందించడం లేదు.. అందుకే డేట్ కోసం వారు సోషల్ మీడియాలో వారు అంతగా రెచ్చిపోతున్నారు.. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్ లని హోల్సేల్ గా ఏకి పారేస్తున్నారు.
నోటికొచ్చిన తిట్లు తిడుతున్నారు. WAKE UP SHANKAR sir, UselessDilRajuShamelessSVC హాష్ టాగ్స్ తో మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ విడుదల తేదీ కోసం రచ్చ మొదలు పెట్టారు. మరి ఇది పీక్స్ కి వెళ్లకముందే మేకర్స్ త్వరపడితే ఓకె.. లేదంటే మెగా ఫాన్స్ ఎక్కడివరకైనా వెళ్లేలా కనిపిసుంది ప్రస్తుత వ్యవహారం. దిల్ రాజునే కాదు.. టాప్ డైరెక్టర్ అని కూడా చూడకుండా శంకర్ సర్ ని కూడా రెవెట్టేస్తున్నారు వారు.
వారెంతగా గోల చేస్తున్నా గేమ్ ఛేంజర్ మేకర్స్ మాత్రం సైలెంట్ గానే కనిపిస్తున్నారు. మరి త్వరపడి ఓ మంచి రోజు చూసుకుని గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అప్డేట్ ఇస్తే ఇది ఇక్కడితో ఆగుతుంది.. ఆలోచించండి దిల్ రాజు గారు.