శ్రీవిష్ణు-నరేష్ హిలేరియస్ కామెడీ అంటూ సామజవరగమన మూవీ చూసిన వాళ్లంతా సినిమాని తెగ పొగిడేస్తున్నారు. సామజవరగమన విడుదలకు ముందే అంటే 5 డేస్ ముందు నుండే మేకర్స్ సినిమా కంటెంట్ పై ఉన్న నమ్మకంతో ప్రీమియర్స్ ప్రదర్శించారు. సామజవరగమన ప్రీమియర్స్ చూసిన వారంతా పొట్ట చెక్కలయ్యే కామెడీ.. నరేష్-శ్రీ విష్ణు మధ్యలో సన్నివేశాలు అద్భుతమంటూ కితాబునిచ్చేస్తున్నారు. ఇలా పాజిటివ్ రెస్పాన్స్ తో విడుదలైన సామజవరగమనకి అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చేస్తాయని చాలామంది అనుకున్నారు.
కానీ ఇప్పుడు చూస్తే రెస్పాన్స్ కీ రెవెన్యూకీ మ్యాచ్ అవ్వట్లేదే.. అనిపించేలా సామజవరగమన ఓపెనింగ్స్ ఫిగర్ కనిపిస్తుంది. నిన్న గురువారం బక్రీద్ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సామజవరగమనకి ఆడియన్స్ నుండి.. క్రిటిక్స్ నుండి సూపర్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా అదిరిపోతాయని ఎక్స్ పెక్ట్ చేసారు. అయితే టాక్ ఒకలా ఉంటే కలెక్షన్స్ మరోలా ఉన్నాయి. సామజవరగమన మొదటిరోజు 2.89 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్టుగా పోస్టర్ వేసి ప్రకటించారు.
మరి సామజవరగమన అంత బావున్నప్పుడు ఈ ఫిగర్ చాలా చిన్నదే. అయితే సామజవరగమన కలెక్షన్స్ మెల్లగా పుంజుకోవడం ఖాయంగా కనబడుతుంది. దీనికి ఖచ్చితంగా మౌత్ టాక్ హెల్ప్ అవుతుంది అనడంలో సందేహము లేదు.