Advertisementt

సామజవరగమన ప్రమోషన్ చూసుకోండయ్యా..

Sun 02nd Jul 2023 12:02 PM
samajavaragamana  సామజవరగమన ప్రమోషన్ చూసుకోండయ్యా..
Check out the Samajavaragamana promotion.. సామజవరగమన ప్రమోషన్ చూసుకోండయ్యా..
Advertisement
Ads by CJ

శ్రీ విష్ణు కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమై ఇబ్బంది పడిన హీరో. బ్రోచేవారెవరురా చిత్రం తర్వాత శ్రీవిష్ణు నుండి మళ్ళీ అంత మంచి సినిమా రాలేదు. తాజాగా శ్రీవిష్ణు కి సామజవరగమన సూపర్ సక్సెస్ ఇచ్చింది. రీసెంట్ గా బక్రీద్ స్పెషల్ గా రిలీజ్ అయిన సామజవరగమన చిత్రానికి స్పెషల్ ప్రీమియర్స్ హెల్ప్ చేసాయి. స్పెషల్ ప్రీమియర్స్ తో మంచి టాక్ స్ప్రెడ్ అవడంతో సామజవరగమనకి బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి. తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడంతో కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. 

శని, ఆదివారాలు సామజవరగమనకి బుకింగ్స్ అదిరిపోతున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు తెగ ప్రమోషన్స్ చేసిన టీం ఇప్పుడు హిట్ టాక్ వచ్చాక సైలెంట్ అయ్యింది. కానీ సామజవరగమనకి అదిరిపోయే ఫిగర్స్ నమోదు కావాలంటే పోస్ట్ ప్రమోషన్స్ కూడా అవసరం. సినిమాని ఇంకా ఇంకా ఆడియన్స్ లోకి తీసుకెళితే దానికి కలెక్షన్స్ పెరుగుతాయి. మౌత్ టాక్ ఒక్కటే సరిపోదు.. స్పెషల్ ప్రమోషన్స్ కలెక్షన్స్ పెరగడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి.

మరి శ్రీవిష్ణు హీరోయిన్ రెబ్బ, దర్శకనిర్మాతలు సామజవరగమన ప్రమోషన్స్ అంటూ హడావిడి చేస్తే వీక్ డేస్ లోను దీనికి మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకున్నాం.. ఈమధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదు అని మాట్లాడుకుంటున్నారు. 

Check out the Samajavaragamana promotion..:

Samajavaragamana collection update

Tags:   SAMAJAVARAGAMANA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ