కల్పిక గణేష్ చాలా రోజులుగా మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. కారణం ఆమె చేసే వ్యాఖ్యలు వలనే ఇలా జరుగుతూ ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్స్ కి ఫ్రెండ్ కేరెక్టర్స్ చేసే కల్పిక గణేష్ కి హీరోయిన్ అవ్వాలనే కోరిక. ఆ కోరిక తీరలేదు.. కానీ ఆమె నిత్యం వార్తల్లో ఉండేందుకు ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తుంది. మొన్నామధ్యన ధన్య బాలకృష్ణ.. పెళ్ళై విడాకులు తీసుకున్న మారి దర్శకుడు బాలాజీ మోహన్ ని సీక్రెట్ గా వివాహం చేసుకుంది అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. దానితో ధన్య బాలకృష్ణ - కల్పిక గణేష్ ల మధ్యన పెద్ద గొడవే జరిగింది.
ధన్య బాలకృష్ణ-బాలాజీ మోహన్ లు ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారంటూ కల్పిక వీడియో విడుదల చేసింది. అయితే ఇదే విషయాన్ని బాలాజీ మోహన్ గత ఏడాది డిసెంబర్ లో నిజమే అని చెప్పారు. కానీ కల్పిక గణేష్ తన వ్యక్తిగత జీవితానికి, పరువుకు నష్టం వాటిల్లేలా మాట్లాడింది అంటూ కల్పికపై కేసు వేశారు. తాజాగా కల్పిక గణేష్ ధన్య బాలకృష్ణ-బాలాజీ మోహన్ కి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. ధన్య బాలకృష్ణ-బాలాజీ మోహన్.. మీ పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెబుతున్నాను.
నేను మీ గురించి మాట్లాడిన మాటలు అన్నీ అవాస్తవాలు. మీపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి, అభిమానులకి క్షమాపణలు చెబుతున్నాను. ఇకపై ధన్య బాలకృష్ణ, బాలాజీ మోహన్ ల గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడను అంటూ వీడియో రిలీజ్ చేయగా.. బాలాజీ కూడా కల్పికపై పెట్టిన కేసుని వాపస్ తీఉస్కోగా.. కోర్టు మాత్రం కల్పిక సారి చెప్పిన వీడియోని అలానే ఉంచాలని ఆదేశించింది.