Advertisementt

హ్యాట్సాఫ్: సామాన్యుడి కాళ్ళు కడిగిన సీఎం

Thu 06th Jul 2023 07:29 PM
mp cm shivraj singh chouhan  హ్యాట్సాఫ్: సామాన్యుడి కాళ్ళు కడిగిన సీఎం
CM Shivraj Chouhan Apologises To Victim హ్యాట్సాఫ్: సామాన్యుడి కాళ్ళు కడిగిన సీఎం
Advertisement
Ads by CJ

మధ్య ప్రదేశ్ కి చేసిన ఓ వ్యక్తి అక్కడి ట్రైబల్ (ఆదివాసీ యువకుడి)పై మూత్ర విసర్జన చేసిన వీడియో తీవ్ర దుమారాన్ని రేపడమే కాదు.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ లో సీది జిల్లాలో జరిగిన ఆ సంఘటన అందరిని కలిచివేసింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిందుతుడు ప్రవేశ్ శుక్లాపై ఇమ్మిడియట్ గా చర్యలు చేపట్టి అతనిని అరెస్ట్ చెయ్యడమే కాకుండా.. అతని ఇంటిని అధికారులు కూల్చిపారేసి పనిష్ చేసారు. నేడు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ట్రైబల్ ని ఇంటికి పిలిపించుకున్నారు.

అంతేకాకుండా సీఎం చౌహన్ అతని కాళ్ళు కడిగిన వీడియో వైరల్ గా మారింది. భోపాల్ లోని తన ఇంటికి పిలిపించుకున్న ముఖ్యమంత్రి చౌహన్ స్వయంగా అతని కాళ్లు కడిగి అతన్ని పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోమని, ఇలాంటి చర్యలని సహించేది లేదు అన్నారు. ఈ సంఘటనకు సంబందించిన వీడియో చూసి నేనెంతో బాధపడ్డాను. ఈ విషయమై నేను క్షమాపణలు కోరుతున్నా.. ప్రజలే నాకు దేవుళ్ళు. ఈ రాష్ట్రంలోని ప్రతి పౌరుడి గౌరవం తన గౌరవమే అన్నారు. ఇది చూసిన మధ్య ప్రదేశ్ ప్రజలు సీఎం చౌహన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

CM Shivraj Chouhan Apologises To Victim:

MP CM Shivraj Singh Chouhan washes feet of tribal man

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ