Advertisementt

పుష్ప2 ఐటమ్ అంత కాష్ట్లీనా ?

Sat 08th Jul 2023 10:31 AM
urvashi rautela  పుష్ప2 ఐటమ్ అంత కాష్ట్లీనా ?
Is pushpa2 item that expensive? పుష్ప2 ఐటమ్ అంత కాష్ట్లీనా ?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ఐటమ్ సాంగ్స్ కి స్పెషల్ గా మారిపోయింది ఊర్వశి రౌతేలా. వాల్తేర్ వీరయ్యలో చిరుతో కలిసి స్టెప్స్ వేసి దుమ్ము రేపిన ఊర్వశి.. ఏజెంట్ లో అఖిల్ తో కాలు కదిపింది. వాల్తేర్ వీరయ్య హిట్ అవగా. ఏజెంట్ ఆమెని నిరాశపరిచింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల BRO మూవీ లో ఐటమ్ సాంగ్ చేసింది. సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన BRO మూవీ ఐటమ్ లో మెరిసిన ఊర్వశి పై పుష్ప మేకర్స్ కన్ను పడిందట.

పుష్ప ద రైజ్ లో సమంత ఊ అంటావా మావ అంటూ ప్యాన్ ఇండియా ప్రేక్షకులని ఊపేసింది. ఆ సాంగ్ భీభత్సమైన హిట్ అవడంతో ఇప్పుడు పుష్ప 2 లో వచ్చే ఐటెమ్ సాంగ్ పై అందరిలో విపరీతమైన ఆసక్తి మొదలయ్యింది. అందుకే సుకుమార్ ఈసారి కూడా అదిరిపోయే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసినట్లుగా దానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ కోసం మరోసారి ఉర్వశిని రౌతెల్లని తీసుకుంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారట. 

అయితే ఊర్వశి రౌతేలా పుష్ప 2 సాంగ్ చెయ్యడం కోసం 7 కోట్లు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. మేకర్స్ కూడా ఫస్ట్ పార్ట్ లో ఆ సాంగ్ హిట్ అవడంతో.. ఇప్పుడు రాబోయే సాంగ్ దానికి మించి ఉండాలనే ప్లాన్ తో ఉర్వశికి ఆ ఐదు కోట్లు ఇచ్చేందుకు సిద్దమయ్యారనే న్యూస్ వైరల్ గా మారింది. 

Is pushpa2 item that expensive?:

Urvashi Rautela Huge Remuneration for Pushpa 2 Item Song

Tags:   URVASHI RAUTELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ