Advertisementt

చైతూ-చందూ మూవీ బ్యాక్ డ్రాప్ రివీల్డ్

Sat 08th Jul 2023 10:18 PM
naga chaithanya  చైతూ-చందూ మూవీ బ్యాక్ డ్రాప్ రివీల్డ్
Chaitu-Chandoo Mondeti Movie Background Revealed చైతూ-చందూ మూవీ బ్యాక్ డ్రాప్ రివీల్డ్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య కస్టడీ డిసాస్టర్ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటితో జత కట్టాడు. కస్టడీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీ రీఛార్జ్ అయిన నాగ చైతన్య అతి త్వరలోనే చందూ మొండేటి తో కలిసి సెట్స్ లోకి వెళ్లబోతున్నాడు. కార్తికేయ 2 తో ప్యాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటిన చందూ మొండేటి నాగ చైతన్య తో ఎలాంటి సినిమా ప్లాన్ చేస్తున్నాడో అనే క్యూరియాసిటీ నాగ చైతన్య ఫాన్స్ లో మొదలయ్యింది. ఎలాంటి బ్రాక్డ్రాప్ తో వస్తాడు, ఈ చిత్రానికి టైటిల్ ఏమిటి అని ఆలోచించేస్తున్నారు.

అయితే తాజాగా చందు మొండేటి నాగ చైతన్యతో శ్రీకాకుళం, గుజరాత్ నేపథ్యం ఉన్న కథతో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. కథ, కథనం అన్ని బాగా వచ్చాయని ఇన్సైడ్ టాక్. ఈ చిత్రానికి #Thandel అనే టైటిల్ పెట్టేసినట్లుగా చెబుతున్నారు. చైతూ-చందు కాంబో మూవీ #Thandel టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. అతి త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ మూవీని మొదలు పెట్టి అంతే స్పీడుగా రెగ్యులర్ షూట్ కి వెళ్లాలని డిసైడ్ అయ్యారట.

ఇక చందూ మొండేటి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టి నటుల ఎంపికపై ఫోకస్ చేశారట. అలాగే నాగ చైతన్య పక్కన కనిపించబోయే హీరోయిన్ వేటలో చందూ ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Chaitu-Chandoo Mondeti Movie Background Revealed:

Naga Chaithanya-Chandoo Mondeti Movie title locked

Tags:   NAGA CHAITHANYA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ