సీతారామం మూవీ ప్యాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ కి సూపర్ క్రేజ్ వచ్చి పడింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో సీతారామం చిత్రం సూపర్ హిట్ అవడంతో.. అందరి చూపు మృణాల్ పైన పడింది. హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, సీరీస్ లతో అలరించిన మృణాల్ కి సీతారామం తర్వాత సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ చిత్రాల్లో ఛాన్స్ లు పట్టేసింది.
నాని తో #Nani30 లో నటిస్తుంది. అలాగే విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబోలో రాబోతున్న చిత్రంలో ఆఫర్ పట్టేసిన మృణాల్ ఠాకూర్ ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆమె రీసెంట్ గా SIIMA అవార్డ్స్ ప్రెస్ లో మెరిసింది. హీరో రానా తో కలిసి సందడి చేసింది. అయితే మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తనకొస్తున్న ఆఫర్స్ చూసి పారితోషకం అమాంతం పెంచేసిందట. అంటే ఇప్పుడు సౌత్ లో సినిమా చెయ్యాలంటే 2 కోట్లు డిమాండ్ చేస్తుందట. కేవలం తెలుగునే కాదు.. తమిళంలోనూ శింబు చెయ్యబోతున్న ప్రాజెక్ట్ లో మృణాల్ పేరు పరిశీనలో ఉంది.
అందుకే అమ్మడు రెండు కోట్లు ఇస్తేనే సినిమా చేస్తాను అని తెగేసి చెబుతుందట. మరి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా బుక్ చేసుకోవాలంటే నిర్మాతలు రెండు కోట్లు రెడీ చేసుకోవాల్సిందే. సీతారామం తో పాటుగా మరో హిట్ పడితే అమ్మడు రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.