సిద్దు జొన్నలగడ్డ పై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. కారణం సిద్దు డైరెక్షన్ లో వేళ్ళు పెడతాడు.. సెట్స్ లో ఎదో ఒక దానిలో కాలు, చెయ్యి పెడతాడంటూ ఇలా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అంతెందుకు డీజే టిల్లు సక్సెస్ తర్వాత టిల్లు స్క్వేర్ స్టార్ట్ చేసాక ఆ సినిమా విషయంలో రకరకాల న్యూస్ లు వినిపించాయి. ముఖ్యంగా నేహా శెట్టి సిద్దు జొన్నలగడ్డ వలనే సీక్వెల్ లో నటించడం లేదు అంటే.. ఆతరవాత అనుపమ పరమేశ్వరన్ కూడా కొన్ని సీన్స్ చేసేందుకు ఒప్పుకోలేదు.. అందుకే బయటికెళ్ళిపోయింది అంటూ ప్రచారం జరిగింది. ఇదంతా సిద్దు వలనే జరిగింది అనే ప్రచారం కూడా ఉంది.
ఇక టిల్లు స్క్వేర్ లో ఫైనల్ గా అనుపమనే హీరోయిన్ గా సెట్ అయ్యింది.. కూల్ గా షూటింగ్ జరుపుకుంటుంది. అన్నీ బాగున్నాయనే సమయంలో మళ్ళీ ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డపై ఓ రూమర్ వైరల్ గా మారింది. అది సిద్దు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ దర్శకుడు మాలిక్ రామ్ తో ఆడుకుంటున్నాడట. డీజే టిల్లు హిట్ అవడంతో సిద్దు పాత్ర ఎంతో ఉంది. అప్పట్లో డీజే టిల్లు కోసం పని చేసిన దర్శకుడు విమల్ కృష్ణ తో కూడా సిద్దు.. దర్శకత్వంలో వాటిల్లో వేళ్ళు పెట్టినా ఆ సినిమా హిట్ అయ్యింది. అందులో అది కొట్టుకుపోయింది. దానితో టిల్లు స్క్వేర్ కి విమల్ కృష్ణ సైలెంట్ గా తప్పుకున్నాడు.
దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ గా రాబోతున్న ఈ చిత్రంలోనూ జొన్నలగడ్డ ఇన్వాల్వెమెంట్ ఎక్కువవడంతో దర్శకుడు బాగా ఫీలవుతున్నాడట. సిద్దు చెప్పినట్లుగా దర్శకుడు ఫాలో అవ్వాల్సి రావడంతో దర్శకుడు మాలిక్ రామ్ ఏమి చెయ్యలేని పరిస్థితిలో గుర్రుగా ఉన్నాడనే టాక్ వినిపిస్తుంది. నటుడిగా, రైటర్ గా సిద్దు సక్సెస్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టే దర్శకుడు సిద్దూని భరిస్తున్నాడట. లేదంటే అక్కడ వ్యవహారం మరోలా ఉండేది అని అంటున్నారు. మరి వీరి కోపతాపాలు పక్కన పెట్టి త్వరగా ఆ రిలీజ్ ప్లాన్స్ చూడండి అంటూ సిద్దు ఫాన్స్ కోరుకుంటున్నారు.