బాలీవుడ్ హీరోయిన్స్ కి క్రేజీ పారితోషకాలు ఉంటాయి. టాప్ హీరోయిన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బాలీవుడ్లో దీపికా పదుకొనే, అలియా భట్, కియారా అద్వానీ ఇలా చాలామంది హీరోయిన్స్ కి పారితోషకాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ఇప్పుడొక ఐటెం గర్ల్ టాప్ హీరోయిన్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది అనే టాక్ వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ఈ మధ్యన టాలీవుడ్ ఐటెం సాంగ్స్ తో దుమ్మురేపుతున్న ఊర్వశి రౌతేల్ల. ఊర్వశి రౌతేలా మిస్ దివా 2015తోపాటు అనేక అందాల పోటీల్లో రాణించింది. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించింది.
బాలీవుడ్ లో ఐశ్వర్య రాయ్ అంత టాప్ పొజిషన్ లో ఉంటుంది, హీరోయిన్ గా దూసుకుపోతుంది అనుకుంటే.. ఊర్వశి మాత్రం ఏ రేంజ్ కి చేరలేకపోయింది. హనీ సింగ్, గురు రంధవా వంటి పాపులర్ సింగర్స్ మ్యూజిక్ వీడియోలుచేసింది. వాల్తేరు వీరయ్య సినిమాలో బాసు వేరీజ్ ది పార్టీ అంటూ చిందులేసిన ఊర్వశి అప్పట్లో 2 కోట్లు వసూలు చేసినట్లు టాక్. ఏజెంట్ సినిమాలో వైల్డ్ సాలా అంటూ అఖిల్ తో కలిసి స్టెప్పులు వేసింది. తాజాగా పవన్ కల్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
బ్రో లో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల తో కలిసి స్పెషల్ సాంగ్ లో 3 నిమిషాలు కనిపించేందుకు ఏకంగా 3 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో నిమిషానికి కోటి చొప్పున వసూలు చేస్తోన్న ఊర్వశి క్రేజ్ మాములుగా లేదుగా అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతుంది.