అదేమిటి ఇంకా థియేటర్స్ లో ఇరగదీస్తున్న సామజవరగమన ని అప్పుడే ఓటిటి లో రిలీజ్ చేస్తారా అనుకుంటున్నారేమో. అప్పుడే కాదు.. ఈ నెల అంటే జులై 22 కానీ 25 కానీ ఓటిటిలోకి తెచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన సామజరవగమన మూవీ గత నెల29 న విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుని థియేటర్స్ లో రిలీజ్ అవగా.. సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే మొదటిరోజు రెండో రోజుల అంతమాత్రంగా ఉన్న కలెక్షన్స్ మౌత్ టాక్ తో రెండు వారాలైనా అదిరిపోతున్నాయి.
ఇప్పటికీ ఓవర్సీస్ లో సామజవరగమన మూవీని ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలాగే రెండో వారంలోను తెలుగు రాష్ట్రాల్లో సామజవరగమన మంచి ఫిగర్స్ నమోదు చేస్తుంది. ఇంకా థియేటర్స్ లో సక్సె ఫుల్ గా రన్ అవుతున్న సామజవరగమనకి ఓటిటి డేట్ లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. మంచి ధరతో నెట్ ఫ్లిక్స్ సామజవరగమన ఓటిటి హక్కులు దక్కించుకోగా.. ఈ చిత్రాన్ని ఈ నెల 22 కానీ 25 న కానీ ఓటిటిలో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.
మరి థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని ఓటిటిలో వీక్షించేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు డేట్ వచ్చేస్తుంది అని తెలిసి ఇంకా హ్యాపీ గా ఉన్నారు.