బండ్లన్న.. ఈ పేరు వింటే కొందరికి పూనకాలు వచ్చేస్తాయి. సాధారణంగా హీరోలకి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు.. కానీ బండ్ల గణేష్‌కి మాత్రం కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఎవరి పేరు చెబితే.. ఓ వర్గం కాలర్ ఎగిరి నిలబడుతుందో.. ఆయనే బండ్ల గణేష్. కరోనా టైమ్‌లో రెండు, మూడు సార్లు దాని అంతు చూసి కోలుకున్న బండ్ల గణేష్.. ఇప్పుడు సినిమాలేవీ చేయడం లేదు కానీ.. సోషల్ మీడియాని మాత్రం వదలడం లేదు. ఆయన చేసే పోస్ట్‌లు, రీ ట్వీట్‌లు ఓ వర్గపు ఫ్యాన్స్‌కి మజానిస్తుంటాయి. అలాంటి బండ్ల గణేష్ ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నట్లుగా ఓ పిక్ బాగా వైరల్ అవుతోంది.
బండ్లన్న హాస్పిటల్‌లో బెడ్‌పై, సెలైన్ పెట్టుకున్నట్లుగా ఓ ఫొటో సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది. అంతే.. ఆయనకి ఏమైందో అని.. ఆయన ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. మరో వైపు రోజూ గుడ్డు తినే నీకు అనారోగ్యమా? అసలు ఏమైందన్నా? అంటూ ఒకటే కామెంట్స్. అసలు బండ్ల గణేష్‌కి ఏమైంది. ఈ పిక్ ఇప్పటిదేనా? అంటూ కొందరు ఎంక్వైరీలు మొదలెట్టారు. ఈ ఎంక్వైరీలో వారికి ఏం తేలిందంటే..
బండ్ల గణేష్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారట. హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారనేలా కొందరు వివరణ ఇస్తున్నారు. కానీ బండ్ల గణేష్ మాత్రం ట్విట్టర్‌లో యాక్టివ్‌గానే ఉన్నారు. కొన్ని గంటల క్రితం కూడా గుడ్ మార్నింగ్ చెబుతూ.. జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు. దీంతో బండ్ల గణేష్‌కి ఏం కాలేదని, అది ఓల్డ్ పిక్ అంటూ కొందరు వాదిస్తున్నారు. మరికొందరేమో.. బండ్ల గణేష్ అకౌంట్‌ని వేరొకరు మెయింటైన్ చేస్తున్నారంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిలో ఏది నిజమో.. ఆయనే వివరణ ఇవ్వాల్సి ఉంది.