బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కావడానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే యాజమాన్యం బిగ్ బాస్ 7 ప్రోమోతో వచ్చేసింది. లోగో వదిలింది. అలాగే కంటెస్టెంట్స్ ఎంపిక ఆల్మోస్ట్ పూర్తయినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాస్, బ్యాంకాక్ పిల్ల శ్రావణి లాంటి వాళ్ళు ఎంట్రీ అవ్వబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. అలాగే అమరదీప్ ఆయన భార్య కలిసి జంటగా బిగ్ బాస్ 7 లో సందడి చేయబోతున్నారని అంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. బ్యాంకాక్ పిల్ల అంటూ యూట్యూబ్ లో హడావిడి చేసే శ్రావణి సీజన్ 7 లోకి అడుగుపెట్టబోతుంది.. అందుకే ఆమె బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కి బయలు దేరింది అంటూ మాట్లాడుతున్నారు.
బ్యాంకాక్ లో ఏం చేసినా, హోమ్ టూర్, ఫ్రిజ్ టూర్ ఇలా వీడియోస్ చేస్తూ ఫేమస్ అయిన శ్రావణి ఎప్పుడో బ్యాంకాక్ లో సెటిల్ అయ్యింది. ఈమధ్యనే ఫ్యామిలీతో ఆమె పుట్టింటికి వచ్చి రీసెంట్ గానే హైదరాబాద్ నుండి బ్యాంకాక్ వెళ్ళింది. మళ్ళీ కొద్ది నెలల్లోనే ఆమె హైదరాబాద్ కి రావడంపై బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అందుకే శ్రావణి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వస్తుంది అంటున్నారు. ఈ విషయమై శ్రావణి స్పందించింది. తనకి బిగ్ బాస్ నుండి ఎలాంటి ఆహ్వానం అందలేదు. నేను వేరే పని మీదే హైదరాబాద్ కి వచ్చాను.. నన్ను బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించలేదు అని చెబుతుంది.
నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నాను అనే వార్తలు ఎవరు పుట్టించారో కానీ.. అది విని నాకే ఆశ్చర్యం వేసింది. ఆ వార్తలు వైరల్ అవడంతో నా మీద నాకే అనుమానం వచ్చి నిజంగానే సెలక్ట్ అయ్యానేమో అనుకుని మెయిల్ కూడా చెక్ చేసుకున్నాను. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ నిజంగా బిగ్ బాస్ ఆఫర్ వస్తే మీకు చెబుతాను. అప్పటివరకు ఇలాంటి పుకార్లని నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చేసింది.