Advertisementt

బిగ్ బాస్ 7 నాగార్జున ప్రోమో వచ్చేసింది

Wed 19th Jul 2023 11:09 AM
bigg boss 7  బిగ్ బాస్ 7 నాగార్జున ప్రోమో వచ్చేసింది
Bigg Boss 7 Nagarjuna Promo is here బిగ్ బాస్ 7 నాగార్జున ప్రోమో వచ్చేసింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా ఎవరొస్తారు. నాగార్జున ఈసారి సీజన్ కి తప్పుకుంటారు అనే ప్రచారం గట్టిగా జరిగింది. నాగ్ ప్లేస్ లోకి అన్ స్టాపబుల్ తో హోస్ట్ గా అదరగొట్టిన బాలకృష్ణ కానీ.. లేదంటే రానా కానీ బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా వస్తారేమో అన్నారు. కానీ సీజన్ 7 కి నాగార్జున హోస్ట్ గా కన్ ఫర్మ్ అయ్యింది. అదే విషయన్ని బిగ్ బాస్ యాజమాన్యం ప్రోమోతో స్పష్టతనిచ్చారు. స్టార్ మా మరియు డిస్నీ+ హాట్‌ స్టార్‌ ఓటీటీలోనూ బిగ్ బాస్  స్ట్రీమింగ్‌ కానుందని కూడా చెప్పారు.

బిగ్ బాస్ గత నాలుగు సీజన్లకు నాగార్జునే యాంకర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం 5వసారి కూడా నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నారు. బిగ్ బాస్ గురించి మీకు తెలిసిందని మీరు అనుకున్నదంతా విప్లవాత్మకంగా మారబోతోంది మీకు అత్యంత ఇష్టమైన నాగార్జునతో ఈ సీజన్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా.. గందరగోళంగా ఉందా.. ఉత్సాహంగా ఉందా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి మరింత తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి అంటూ బిగ్ బాస్7 కొత్త ప్రోమోని వదిలారు. నాగార్జున సరికొత్త లుక్ అదరగొట్టారు.

ఇక ఈ సీజన్ లోకి ఎవరు ఎంట్రీ ఇస్తారో అనే విషయమై అందరిలో క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే గత సీజన్స్ లో జరిగిన పరిణామాలతో సెలబ్రిటీస్ ఎవరూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అందుకే ఈ సీజన్ లోకి ఎవరెవరు వస్తారో అంటూ అందరూ ఆత్రంగా చూస్తున్నారు.

Bigg Boss 7 Nagarjuna Promo is here:

Bigg Boss 7 new Promo out

Tags:   BIGG BOSS 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ