మెగాస్టార్ మనవరాలు, రామ్ చరణ్-ఉపాసనల గారాల పట్టి క్లింకార ఫస్ట్ ఫోటో కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. పాప పుట్టి నేటికి నెల పూర్తయ్యింది. జూన్ 20 న ఉపాసన కొణిదెల ఆడపిల్లకి జన్మనివ్వగా. పాప పుట్టిన ఐదో రోజు ఉపాసన అపోలో ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయ్యింది. ఆ తర్వాత 11 రోజులకి పాపకి బారసాల చేసి క్లింకారగా నామకరణం చేసారు. ఆ తర్వాత క్లింకార గురించి ఎలాంటి విషయాలు బయటికి రాకపోయినా.. ఉపాసన తన బేబీ కోసం స్పెషల్ రూమ్ ని ఎలా డెకరేషన్ చేయించుకుందో వీడియో ద్వారా పంచుకుంది.
అయితే ఈ రోజుకి క్లింకార జన్మించి నెల పూర్తయిన సందర్భంగా ఉపాసన క్లింకార పుట్టినప్పుడు ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉందో.. పుట్టిన తర్వాత బారసాల ఎంత అట్టహాసంగా జరిగిందో.. పాప బారసాల వేడుకలో, పాప పుట్టిన సమయంలో చరణ్ ఎంత ఆనందంగా ఉన్నాడో అనేది ఓ వీడియో ద్వారా పంచుకుంది ఉపాసన, నేడు ఉపాసన బర్త్ డే కూడా కావడంతో ఉపాసన తన కుమర్తె ని తమ ఫ్యామిలీలోకి ఎంత సంతోషంగా ఆహ్వానించారో అనేది తెలియజేసింది.
డెలివరీ సమయంలో ఉపాసనతో ఆసుపత్రికి వచ్చిన చరణ్.. ఆపరేషన్ థియేటర్ లోకి చరణ్ వెళ్లడం, పాపతో బయటికి రావడం, ఉపాసన తల్లితండ్రులు అలాగే మెగాస్టార్ ఫామిలీ స్వీట్స్ పంచుకుని పండగగ చేసుకోవడం, ఇవన్నీ ఆ వీడియోలో పంచుకుంది ఉపాసన. అంతేకాకుండా ఆ వీడియో తో పాటుగా ఉపాసన పాప పుట్టేసమయంలో అంతా మంచి జరగాలని చాలా ప్రార్ధించాం. పాప పుట్టాక అంతా మంచిగా అనిపించింది. తొమ్మిదినెలల ప్రయాణం గుర్తు చేసుకున్నాం. మా పాప ద్రవిడ సంసృతిలో భాగం కావాలని కోరుకున్నాం. పాప పేరుకి ముందు వెనుక ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వొద్దు.
అవి వాళ్ళే స్వయంగా సాధించుకోవాలి. పిల్లల పెంపకంలో అవెంతో కీలకం. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలంటూ ఉపాసన ఇన్స్టాలో రాసుకొచ్చింది.