Advertisementt

కమేడియన్ యాదమ్మరాజుకి యాక్సిడెంట్

Mon 24th Jul 2023 09:28 PM
comedian yadamma raju  కమేడియన్ యాదమ్మరాజుకి యాక్సిడెంట్
Comedian Yadamma Raju Leg Injured కమేడియన్ యాదమ్మరాజుకి యాక్సిడెంట్
Advertisement
Ads by CJ

ఈటివి ప్లస్ ఛానల్ తో కమేడియన్ గా ఎంట్రీ ఇచ్చిన యాదమ్మ రాజు ఆ తర్వాత జీ తెలుగు అదిరింది కామెడీ షో తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత యాదమ్మ రాజు ఈటివి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరో కమేడియన్ సద్దాంతో కలిసి టీమ్ గా ఏర్పడి స్కిట్స్ చేస్తూ కామెడీ చేస్తున్నాడు. అయితే యాదమ్మ రాజు యూట్యూబర్ స్టెల్లాని ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్టెల్లా తో కలిసి యూట్యూబ్ వీడియోస్, అలాగే స్టేజ్ షోస్ చేసే యదమ్మ రాజుకి యాక్సిడెంట్ అయినట్టుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా వదిలిన వీడియోతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి చిన్న విషయాన్నీ యూట్యూబ్ వీడియో ద్వారా షేర్ చేసే స్టెల్లా-యాదమ్మ రాజులు తాజాగా యాదమ్మ రాజు ఆసుపత్రిలో కాలుకి కట్టు కట్టించుకుని నడవలేని స్థితిలో కనిపించాడు. స్టెల్లా ఈ మధ్యనే అమెరికా MS చెయ్యడానికి వెళ్లి ఆరు నెలలు తిరక్కముందే ఆమె హైదరాబాద్ వచ్చేసి భర్తతో మళ్ళీ షోస్ చేసుకుంటుంది. అయితే యాదమ్మ రాజు ఎందుకు ఆసుపత్రిలో ఉన్నాడు. అతని కాలుకి ఏమైందో తెలియదు కానీ.. కాలుకి కట్టు కట్టించుకుని భార్య స్టెల్లా సపోర్ట్ తో నడుస్తున్నాడు.

యాదమ్మ రాజు కాలుకి సర్జరీ జరిగినట్లుగా చెప్పాడు. అయితే ఎందుకు సర్జరీ జరిగింది, ఎమన్నా యాక్సిడెంట్ అయ్యిందా.. లేదంటే మారేదన్నా సమస్యతో యాదమ్మ రాజు బాధపడుతున్నాడా అనేది మాత్రం చెప్పలేదు. బహుశా మరో వీడియోలో రివీల్ చేస్తారేమో.. చూద్దాం.

Comedian Yadamma Raju Leg Injured:

Comedian Yadamma Raju Met With Accident

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ