Advertisementt

మరోసారి వాయించేసిన టిల్లు

Wed 26th Jul 2023 04:59 PM
tillu square  మరోసారి వాయించేసిన టిల్లు
Tillu Square First Single out మరోసారి వాయించేసిన టిల్లు
Advertisement
Ads by CJ

డీజే టిల్లు ఇప్పటికీ యూత్ ని ఎట్రాక్ట్ చేసే చిత్రం. టిల్లు  పాత్రతో యువతకు బాగా దగ్గరైన సిద్ధు జొన్నలగడ్డ బాలయ్య షో  తో మరింతగా యూత్ హృదయాలని కొల్లగొట్టాడు. ఈ చిత్రంలో రాధికా నేహా శెట్టితో సిద్దు రొమాన్స్ అయితే బాగా పాపులర్ అయ్యింది. తెలుగు చిత్రసీమలో కల్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఎనెర్టైన్మెంట్ కి కేరాఫ్ గా డీజే టిల్లు అద్భుతమైన హిట్ అవడంతో దానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరోసారి సిద్దు జొన్నలగడ్డను టిల్లుగా చూడబోతున్నాం. ఈసారి వినోదం మొదటి దానికి రెట్టింపు ఉంటుందని చిత్ర నిర్మాతలు ఇప్పటికే హామీ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమా పతకాలపై సూర్యదేవర నాగ వంశీ తమ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ డీజే టిల్లుకు సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. 

డీజే టిల్లు చిత్రంలో రామ్ మిరియాల స్వరపరిచి, పాడిన టిల్లు అన్న డీజే పెడితే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి, అది టిల్లు పాత్రకు గుర్తింపుగా మారింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కోసం కూడా రామ్ మిరియాల, సరికొత్త పాటను స్వరపరచి ఆలపించారు. ఈ పాట జూలై 26న సాయంత్రం 4:05 గంటలకు విడుదలైంది. మాస్ బీట్స్ తో కాలు కదిపేలా హుషారుగా సాగిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. టిల్లు అన్న డీజే పెడితే పాట లాగానే, టికెట్ ఏ కొనకుండా పాట కూడా పార్టీలు, పబ్‌ల అనే తేడా లేకుండా ప్రతి చోటా ప్లే అయ్యేలా, యువత అమితంగా ఇష్టపడేలా ఉంది. పబ్‌లో మరొక అమ్మాయిని కలిసి, ప్రేమించి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా టిల్లును హెచ్చరిస్తున్నట్లుగా సాగింది. 

ఇక్కడ ఈ సాంగ్ లో క్యూట్ కర్లీ హెయిర్ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా రొమాంటిక్ యాంగిల్ ని చూపించేసింది. సిద్దు తో కలిసి అనుపమ చెయ్యబోయే రచ్చ సినిమాలో ఎలా ఉంటుందో అని యూత్ ఊహించేసుకుంటున్నారు. సాంగ్ ప్రోమోలో ఆమె లుక్ మరియు టిల్లుతో ఆమె సంభాషణ వైరల్‌గా మారాయి. మొత్తానికి ఈ పాట టిల్లు స్క్వేర్ పై ఇప్పటికే ఏర్పడిన అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

Tillu Square First Single out:

Tillu Square First Single released 

Tags:   TILLU SQUARE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ