మాళవిక మోహనన్ మలయాళం నుండి వచ్చి చెన్నై లో జెండా పాతేందుకు కష్టపడుతుంది. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న మాళవిక మోహాన్ కి అదిరిపోయే సక్సెస్ ఇంతవరకు తగల్లేదు. విజయ్ మాస్టర్ హిట్ అయినా, అది పాపకి అంతగా హెల్ప్ అవ్వలేదు. టాలీవుడ్ లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తుంది. ఇది గనక వర్కౌట్ అయితే పాపకి తెలుగులో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ సరసన అవకాశాలు దొరుకుతాయి. మరోపక్క విక్రమ్ తో నటిస్తున్న తంగలాన్ లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది అని నమ్ముతుంది. అయితే తాను సినీ రంగ ప్రవేశం చేసి దశాబ్దం పూర్తయ్యింది. ఇప్పటివరకు ఎలా ఉన్నా ఇకపై కథలు ప్రాముఖ్యం ఉన్న సినిమాల్లోనే నటించాలని అనుకుంటున్నాను. 500 కోట్ల భారీ బడ్జెట్ మూవీ అయినా నా పాత్రకి ప్రాధాన్య లేకపోతే.. ఒప్పుకోను. అందులో నటించడానికి అంగీకరించను.. అంటూ చెప్పుకొచ్చింది. అంటే కొంతమంది హీరోయిన్స్ భారీ బడ్జెట్ సినిమాల్లో కనిపిస్తే చాలనుకుని ఒప్పేసుకుంటున్నారనేది మాళవిక మోహనన్ ఉద్దేశ్యం అయ్యుండొచ్చు. అందుకే ఇలాంటి కామెంట్స్ చేసింది అనుకుంటున్నారు.
అసలు ఇప్పటివరకు మాళవిక మోహనన్ కూడా పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలే చేసింది. ధనుష్ చిత్రం, మాస్టర్ ఇలా ఆమె చేసిన పాత్రలేమి ఆమెకి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. సోషల్ మీడియాలో గ్లామర్ ని చూపిస్తూ అవకాశాల కోసం వెతుక్కుంటున్న మాళవిక మోహనన్ కి విక్రమ్ తంగలాన్ అయినా హిట్ అవుతుందేమో అని ఆశపడుతోంది. ఒకవేళ అది కానీ, ప్రభాస్ మూవీ కానీ హిట్ అయితే మాళవిక ఇక ఆగదు.