Advertisementt

దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతోంది ఆమెనేనా?

Mon 07th Aug 2023 02:55 PM
devi sri prasad,singer mangli,indravathi,marriage  దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతోంది ఆమెనేనా?
Again News Viral on Devi Sri Prasad Marriage దేవిశ్రీ పెళ్లి చేసుకోబోతోంది ఆమెనేనా?
Advertisement
Ads by CJ

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించే సంగీతం ఎంత ఫేమస్సో.. ఆయన పెళ్లిపై వచ్చే వార్తలు కూడా అంతే ఫేమస్ అవుతుంటాయి. ఎందుకంటే.. నాలుగు పదుల వయసు క్రాస్ చేసినా.. స్టిల్ బ్యాచులర్‌గా మెయింటైన్ అవుతున్నాడు దేవిశ్రీ. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. శ్రియ, ఛార్మీ.. ఇలా లిస్ట్ చాలానే ఉంది. ఇప్పుడా లిస్ట్‌లోకి ఇంకొకరు చేరడంతో.. దేవిశ్రీ పెళ్లి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవి శ్రీ ప్రసాద్‌కి పెళ్లి ఫిక్సయింది.. ఆయన మనువాడబోయేది ఆమెనే అంటూ ఓ పిక్ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఫొటో కథేంటో చూద్దాం.. 

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా మావ’ పాట జనాల్సి ఎలా ఊపేసిందో తెలియంది కాదు. ఈ పాట కన్నడ వెర్షన్‌ని మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. ఈ పాట ఆ భాష, ఈ భాష అనే సంబంధం లేకుండా అన్ని చోట్ల మంచి ఆదరణను పొందింది. కన్నడ వెర్షన్‌లో ఇంద్రావతితో ఈ పాట పాడించిన దేవిశ్రీ.. ఇప్పుడామెను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా నెట్టింట వార్తలు దర్శనమిస్తున్నాయి. మరి ఈ వార్తలైనా నిజం అవుతాయో లేదో తెలియదు కానీ.. దేవిశ్రీ, ఇంద్రావతి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియా మాత్రం బాగా వైరల్ అవుతోంది.

స్టార్ సింగర్ మంగ్లీ సోదరి ఇంద్రావతిని దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడట.. అని ప్రచారం అవుతున్న వార్తలలో.. విషయం ఉందో లేదో తెలియాలంటే.. వారిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది. రీసెంట్‌గా దేవిశ్రీ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఇంద్రావతి ఈ పిక్‌ని షేర్ చేసింది. దీనికే వారిద్దరికి పెళ్లి అంటూ నెటిజన్లు రాతలు చూస్తుంటే.. ఆ లెక్కన ఆయన ఇప్పటికి ఓ 100కి పైగా పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చేది.. ఇదెవరో కావాలని పుట్టించినదే అని దేవి శ్రీ అభిమానులు ఈ న్యూస్‌పై రియాక్ట్ అవుతున్నారు. చూద్దాం.. అసలు విషయం ఏమిటనేది..?

Again News Viral on Devi Sri Prasad Marriage:

Devi Sri Prasad and Singer Mangli Sister Indravathi Pic Goes Viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ