Advertisementt

ఆమెని సూపర్ స్టార్ అంటే ఒప్పుకోదట..

Sun 13th Aug 2023 11:56 AM
kasthuri shankar,nayanthara,lady super star,kollywood  ఆమెని సూపర్ స్టార్ అంటే ఒప్పుకోదట..
Kasthuri Shankar Sensational Comments on Nayanthara ఆమెని సూపర్ స్టార్ అంటే ఒప్పుకోదట..
Advertisement
Ads by CJ

లేడీ సూపర్ స్టార్ అంటే కెపి సుందరాంబల్, విజయశాంతి మాత్రమే.. నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటే అస్సలు ఒప్పుకోను అంటుంది సీనియర్ నటి కస్తూరి. ‘అన్నమయ్య’ సినిమాలో నాగార్జున సరసన నటించిన కస్తూరి అంతకు ముందు కూడా తెలుగులో కొన్ని సినిమాలలో చేశారు. ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ సీరియల్‌లో ఆమె మెయిన్ పాత్రలో నటించారు. ఆ సీరియల్ మంచి ఆదరణనే పొందుతోంది. అయితే నటిగా తన పని తను చేసుకోకుండా.. అప్పుడప్పుడు వివాదపు వ్యాఖ్యలు చేస్తూ.. కస్తూరి వార్తలలో ఉంటూ ఉంటుంది. 

ఆ మధ్య నయనతారకు కవల పిల్లలు పుట్టిన వివాదంలో హాట్ హాట్ కామెంట్స్ చేసిన కస్తూరి.. ఇప్పుడు మరోసారి నయనతారను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. సౌత్‌ ఇండియాలో నయనతారను లేడీ సూపర్‌స్టార్‌ అని అంగీకరించలేం. కోలీవుడ్‌లో రజనీకాంత్‌ బిగ్గెస్ట్‌ స్టార్‌. కమల్‌హాసన్‌, అజిత్‌, విజయ్‌ వంటి ఎందరు ఉన్నప్పటికీ రజనీకాంత్‌ స్థానం వేరు. నటీమణుల్లో లేడీ సూపర్‌స్టార్‌ అంటే అలనాటి నటీమణులు కెపి సుందరాంబల్‌, విజయశాంతి మాత్రమే. వారిని మినహా మరెవరినీ లేడీ సూపర్ స్టార్ అని అనలేం. అసలు ఊహించుకోలేమనేలా కస్తూరి చేసిన కామెంట్స్‌పై నయనతార ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మీ పని ఏదో మీరు చూసుకోండి.. అస్తమానం నయనతారను ఏదో ఒకటి అననిదే మీకు నిద్ర పట్టదు అనుకుంటా.. లేదంటే నయనతారను అంటే ఇండస్ట్రీ మీ వైపు చూస్తుందనే పబ్లిసిటీ స్టంటా? అంటూ నెటిజన్లు కస్తూరిపై కాలు దువ్వుతున్నారు. అయితే వారు అనే మాటల్లో కూడా నిజం లేకపోలేదు. నయనతార తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఎటువంటి కాంట్రీవర్సీలలో తను తల పెట్టకూడదనేలా ఆమె పని ఆమె చేసుకుంటుంటే అస్తమానం కస్తూరి టార్గెట్ చేయడం ఏం బాలేదనే చెప్పుకోవాలి.

Kasthuri Shankar Sensational Comments on Nayanthara :

Nayanthara Not a Lady Super Star Says Kasthuri Shankar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ