Advertisementt

మీ ఆకలి చూసి అప్డేట్ ఇస్తున్నా..

Sun 13th Aug 2023 12:29 PM
ravi teja,tiger nageswara rao,teaser,august,vamsee  మీ ఆకలి చూసి అప్డేట్ ఇస్తున్నా..
All Set For Tiger Nageswara Rao Teaser మీ ఆకలి చూసి అప్డేట్ ఇస్తున్నా..
Advertisement
Ads by CJ

‘తమ్ముళ్లు.. నాకు మీ ఆవేశం ఆక్రోశన అర్థమైంది, కానీ లోకంలో కొన్ని మంచి విషయాలు జరగాలంటే కొంత సమయం తీసుకుంటుంది, మీరు అర్ధం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆకలి చూసి ఈ అప్డేట్ ఇస్తున్నాము. ఇన్ని రోజులు ఓపికగా వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇక మొదలెడదామా..’ అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు ‘టైగర్ నాగేశ్వరరావు’ దర్శకుడు వంశీ. ఆయన చెప్పినట్లుగానే మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్‌కి ఆయన అప్డేట్ ఇచ్చారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు.  

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడు టైగర్ దండయాత్ర మొదలైనట్లుగా చెబుతూ.. ఆగస్ట్ 17న టైగర్ నాగేశ్వరరావు టీజర్‌ని వదలబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

ఇండస్ట్రీలో బిజీగా ఉన్న హీరోలలో రవితేజ ప్రథమ స్థానంలో ఉంటారు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. మూడో సినిమా టైగర్ నాగేశ్వరరావు కూడా ఈ ఏడాదే విడుదల కాబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు కూడా. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. కోలీవుడ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

All Set For Tiger Nageswara Rao Teaser:

Date Fixed for Tiger Nageswara Rao Teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ