Advertisementt

మిల్కీబ్యూటీ మూడ్ మార్చేది ఎవరంటే..

Mon 14th Aug 2023 10:42 AM
ram charan,milky beauty,tamannaah,best friend  మిల్కీబ్యూటీ మూడ్ మార్చేది ఎవరంటే..
Tamannaah Interesting Comments on Ram Charan మిల్కీబ్యూటీ మూడ్ మార్చేది ఎవరంటే..
Advertisement
Ads by CJ

ఈ మధ్య మిల్కీబ్యూటీ తమన్నా పేరు వినబడినట్లుగా మరో హీరోయిన్ పేరు వినబడటం లేదంటే... ఏ రేంజ్‌లో తమన్నా ఫోకస్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ క్రష్ శ్రీలీల టాలీవుడ్ వరకే వార్తలలో నిలుస్తుంది. కానీ తమన్నా మాత్రం అంతర్జాతీయంగా వార్తలలో హైలెట్ అవుతోంది. అందుకు కారణం ఆమె చేసిన వెబ్ సిరీస్‌లే. అలాగే ఈ మధ్య ప్రేమలో పడటం కూడా.. ఆమెకి బాగా కలిసొచ్చింది. ఒక వైపు ప్రేమ వ్యవహారాలు, మరో వైపు వెబ్ సిరీస్‌లు.. ఇంకో వైపు స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు ఇలా నడుస్తుంది తమన్నా మానియా. 

ఆమె నటించిన రెండు సినిమాలు రీసెంట్‌గా బ్యాక్ టు బ్యాక్.. ఒకే ఒక్క రోజు గ్యాప్‌లో విడుదలయ్యాయి. రెండూ కూడా స్టార్ హీరోల చిత్రాలే. ఒకటి రజనీకాంత్ ‘జైలర్’ కాగా, రెండోది చిరంజీవి ‘భోళా శంకర్’. ఈ రెండు చిత్రాలలో ఒకటి బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంటే.. రెండోది డివైడ్ టాక్‌తో నడుస్తోంది. అయితే ఈ రెండు చిత్రాలలో కూడా తమన్నాకు పెద్దగా స్కోప్ లేకపోవడం విశేషం. అయితేనేం ఒక సినిమా సక్సెస్ అయింది కాబట్టి.. ఇప్పుడు తమ్ము సక్సెస్ హీరోయిన్నే. ఇక ఈ సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని మిల్కీబ్యూటీ షేర్ చేసింది. అదేంటంటే.. 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ తనకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని తమన్నా చెప్పుకొచ్చింది. మా ఇద్దరి మధ్య ‘రచ్చ’ సినిమాతో మంచి బాండింగ్ ఏర్పడింది. నాకు మూడ్ బాగోకపోయినా.. పని ఒత్తిడి ఎక్కువైనా.. చరణ్‌కి ఫోన్ చేసి మాట్లాడతా. తను ఎంత బిజీగా ఉన్నా కూడా.. నా ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. చాలా కూల్‌గా మాట్లాడి.. నేను చెప్పేది చక్కగా వింటాడు.. తగిన సూచనలు ఇచ్చి.. నా ఒత్తిడి అంతా దూరం చేసి.. నా మూడ్ మార్చేస్తాడు. అందుకే ఎప్పుడు మూడాఫ్ అయినా.. చరణ్‌కే కాల్ చేస్తానని మిల్కీబ్యూటీ అసలు విషయం చెప్పేసింది.

Tamannaah Interesting Comments on Ram Charan:

Ram Charan Changed my Mood Says Milky Beauty 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ