ఈ ఏడాది సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డితో వస్తే.. ఒక్క రోజు గ్యాప్‌లోనే మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో సందడి చేశారు. సీనియర్ హీరోలైన బాలయ్య-చిరంజీవి తమ సినిమాల రిజల్ట్స్‌తో హ్యాపీగానే ఉన్నారు. అటు ఫాన్స్ కూడా ఈ రెండు సినిమాల విజయాలతో కూల్ గానే కనిపించారు. మరోసారి చిరు vs బాలయ్య అన్నట్టుగా భోళా శంకర్-భగవంత్ కేసరి సినిమాలు ఉంటాయనుకున్నారు.
కానీ మెగాస్టార్ చిరు ఆగస్ట్ 11నే భోళా శంకర్‌తో వచ్చేశారు. కానీ భోళా శంకర్ రిజల్ట్ అటు చిరుని, ఇటూ మెగా ఫాన్స్‌ని బాగా డిజప్పాయింట్ చేసింది. భోళా శంకర్ రిజల్ట్ చూసి అందరూ చిరుని, ఆయన జడ్జిమెంట్‌ని విమర్శిస్తున్నారు. మరి భోళా శంకర్ బోల్తా పడింది. ఇక బాలయ్య ఏం చేస్తారో.. అనేలా ఇప్పుడు టాక్ మొదలైంది. భగవంత్ కేసరితో ఫ్యాన్స్‌కి ఎలాంటి ట్రీట్ ఇస్తారో, ఏం చేస్తారో? అసలు అనిల్ రావిపూడి కామెడీ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో అని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు.
అనిల్ రావిపూడి వదిలిన ఫస్ట్ లుక్, టీజర్ అన్ని సినిమాపై అంచనాలు పెంచగా బాలయ్య లుక్ విషయంలో ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా కనబడుతున్నారు. మరి భగవంత్ కేసరి రిజల్ట్ ఎలా ఉండబోతుందో అనేది అక్టోబర్ 19న తేలిపోతుంది. అప్పటి వరకు ఇలాంటి వార్తలు వినబడుతూనే ఉంటాయి.