గుంటూరు కారం జనవరి 12 న విడుదల అంటూ ఈ ఏడాది ప్రధమార్ధంలోనే మేకర్స్ గొప్పగా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మరి అందుకు అనుగుణంగా గుంటూరు కారం షూటింగ్ అయితే జరగడం లేదు.. మహేష్ బాబు మూడు షెడ్యూల్స్ ఆరు వెకేషన్స్ అంటూ వెళ్లిపోతున్నారు. మధ్యలో త్రివిక్రమ్ యాడ్ షూట్స్, అలాగే టెక్నీకల్ గా తప్పుకున్నవారిని భర్తీ చేసే ప్రాసెస్ లో బిజీగా వుంటున్నారు. మరి ఇంకా షూటింగ్ 80 రోజులపాటు బాలన్స్ వుంది అనే టాక్ ఉంది.
విడుదలకు కేవలం 140 డేస్ మాత్రమే ఉంది. 80 రోజుల షూటింగ్ అంటే.. గ్యాప్ లేకుండా చేస్తేనే కానీ అది ఫినిష్ అవదు.. కానీ మహెష్ తో అది సాధ్యమేనా.. ఆయన అంత స్పీడు గా షూటింగ్ చేస్తారా అంటూ పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. మహేష్ కూల్ గా షూటింగ్ చేసే వ్యక్తి. ఇంత హడావిడిగా గుంటూరు కారం ఫినిష్ చెయ్యాలంటే చాలా కష్టం.
అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి గుంటూరు కారం షూటింగ్ ఫినిష్ అయ్యి జనవరి 12 న విడుదల అవడం పట్ల చాలా రకాల అనుమానాలు రేజ్ అవుతున్నాయి. నిన్నటి నుండి అంటే ఆగస్టు 18 నుండి గుంటూరు కారం కొత్త షెడ్యూల్ మొదలయ్యింది అనే న్యూస్ ఉన్నా.. దానిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.. మొన్నటివరకు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించిన ప్రొడ్యూసర్ నాగ వంశి కూడా ఇప్పుడు సైలెన్స్ ని మెయింటింగ్ చెయ్యడం మహేష్ ఫాన్స్ లో ఆందోళన ఎక్కువయ్యేలా చేస్తుంది.