గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా అనే సందేహం మహేష్ ఫాన్స్ లో చాలానే ఉంది. కారణం ఆ సినిమా షూటింగ్ ఇంతవరకు పూర్తి కాలేదు.. ఇంకా 80 రోజులపాటు షూటింగ్ బాలన్స్ వుంది అనే న్యూస్ చూసాక చాలామంది మహేష్-త్రివిక్రమ్ లు సంక్రాంతికి గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది కలే అని డిసైడ్ అయ్యారు. కానీ మహేష్ బాబు మాత్రం గుంటూరు కారం సంక్రాంతికి పక్కా వస్తుంది అంటూ కుండబద్దలు కొట్టారు.
బిగ్ సి మొబైల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మహేష్ బాబుని ఓ రిపోర్టర్ గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా అని అడిగితే.. బిగ్ సి కి గుంటూరు కారం కి సంబంధం ఉందా అన్నారు. కానీ ఆ రిపోర్టర్ వదలకుండా ఇది ఫాన్స్ ప్రెజర్ మీరు చెప్పాలి, గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా అనగానే.. మహేష్ గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందండి.. సంక్రాంతికి రిలీజ్ అవ్వుద్ది.. మీ ఆనందరికి చాలా ఆనందంగా ఉంటుంది.. అంటూ కన్ ఫామ్ చెయ్యడంతో మహేష్ ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.