Advertisementt

పరిణీతి పెళ్ళికి డేట్ ఫిక్స్

Mon 21st Aug 2023 09:32 PM
parineeti chopra  పరిణీతి పెళ్ళికి డేట్ ఫిక్స్
Parineeti-Raghav Chadha wedding date locked పరిణీతి పెళ్ళికి డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా రీసెంట్ గానే MP రాఘవ్ చద్దాతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొద్దిమంది కుటుంభ సభ్యుల సమక్షంలోనే జరిగిన ఈ నిశ్చితార్థపు వేడుకలో పరిణీతి -రాఘవ్ చద్దాలు ఎంతో ఆనందంతో కనిపించారు. అయితే ఇప్పుడు ఈ లవ్లీ కపుల్ పెళ్ళికి ఫ్యామిలీ మెంబెర్స్ తేదీ ఫిక్స్ చేశారట. పెళ్లికి తేదీ తో పాటుగా ఆ పెళ్ళికి వేదిక కూడా ముస్తాబుకాబోతుంది. 

వచ్చేనెల 25న పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దాలు వివాహం జరగనుందని.. వీరి పెళ్లి ఉదయ్ పూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరుగుతుంది అని తెలుస్తోంది.పెళ్లి ఏర్పాట్లను కూడా పరిణీతి స్వయంగా దగ్గరుండి చూసుకోబోతుందట. ఉదయ్ పూర్ లోని ఉదయ్ విలాస్ పరిణీతి-రాఘవ్ వివాహానికి వేదిక కానుంది.

పెళ్ళికి రెండువారాల ముందే పరిణీతి తను చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఫినిష్ చేసుకుని రిలాక్స్ అవుతుందట. అటు రాఘవ్ కూడా తన పనులని చక్కబెట్టుకుని పెళ్లి వేడుకల్లో జాయిన్ అవుతాడని సమాచారం. పరిణీతి-రాఘవ్ ల వివాహం వాళ్ళ నిశ్సితార్ధం లాగే కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరగనుంది అని.. పెళ్లి తర్వాత గురుగ్రామ్ లో మాత్రం భారీగా రిసెప్షన్ ప్లాన్ చేశారట. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ ప్రముఖులతో పాటుగా రాజకీయ నాయకులు కూడా భారీగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

Parineeti-Raghav Chadha wedding date locked:

Parineeti Chopra, Raghav Chadha to marry on September 25 in Rajasthan

Tags:   PARINEETI CHOPRA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ