గుంటూరు కారం షూటింగ్ విషయంలో మహేష్ ఫాన్స్ లో మొదటి నుండి అయోమయం, ఆందోళన నడుస్తూనే ఉన్నాయి. మహేష్ మధ్య మధ్యలో వెకేషన్స్ అంటూ గుంటూరు కారం షూటింగ్ పక్కనపెట్టెయ్యడం, అలాగే గుంటూరు కారం నుండి హీరోయిన్ దగ్గరనుండి టెక్నీకల్ గా పలువురు దూరమవడం ఈ అయోమయానికి అసలు కారణం. అయితే రీసెంట్ గా మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి వస్తుంది.. మీరు హ్యాపీ ఫీలవుతారంటూ అందరిలో ఆసక్తి రేపారు.
అప్పటివరకు గుంటూరు కారం సంక్రాంతికి రాదు అనుకున్నవారంతా షాకైపోయారు. ఇంత స్పీడుగా ఈ చిత్రం షూటింగ్ ఎలా పూర్తవుతుందా అని. మరి మహేష్ చెప్పిందే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే గుంటూరు కారం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో అంటే ఆరు రోజుల్లో పూర్తవ్వాల్సిన ఇంటర్వెల్ బాంగ్ ని మూడంటే మూడే రోజుల్లో మహేష్-తివిక్రమ్ పూర్త చేసేసారట.
సూపర్ ఫాస్ట్ గా గుంటూరు కారం షూటింగ్ పూర్తవుతుంది అనడానికి ఇంతకన్నా పెద్ద వార్త ఇంకేం కావాలి. రెండు రోజుల క్రితమే శ్రీలీల మహేష్ తో కాంబో సీన్స్ కోసం గుంటూరు కారం సెట్స్ లోకి ఎంటర్ అయ్యిందట. ప్రస్తుతం ప్రత్యేక సెట్ లో ఇంటర్వెల్ బ్యాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.. రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ సారథి స్టూడియోస్ కి షిఫ్ట్ అవ్వనుందట. ఇక్కడ పలువురు కీలక నటులపై కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాల చిత్రీకరణ త్రివిక్రమ్ మొదలు పెడతారట. అలాగే థమన్ కూడా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రెడీ చేస్తున్నాడట.